Health Care

వర్క్‌ప్లేస్ యాంగ్జైటీస్.. అధిగమించే మార్గమిదే..


దిశ, ఫీచర్స్: సృష్టికి మూలం మగువ అంటారు. ఆడదే తన గర్భాశయాన్ని చీల్చి మరొక బిడ్డకు జన్మను ఇస్తుంది. ఆడది లేకపోతే జగతే లేదు. కానీ, చాలా మంది మగవాళ్లు నిజంగా ఆడదాన్ని పిల్లల్నీ కనే ఒక మెషిన్‌లా చూస్తున్నారు. పెళ్లిళ్లు చేసుకుని వంటింటికే అంకితం చేస్తున్నారు. అంతే కాకుండా.. ఎంత చదివిన కూడా ఆడవాళ్లకు ఏం తెలియదు అనే చులకన భావంతో చూస్తూ వారిని ముందడుగు వెయ్యకుండా వంటింటి కుందేళ్లుగా పరిమితం చేస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో ఇలాంటి వారి మగఅహంకారాన్ని ఎదురించడానికి చాలా మంది ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తు్న్నారు. మేము కూడా తెలివైన వాళ్లమే.. మాకు సాధ్యం కానికి ఏది ఉండదు అని నిరూపించుకోవడమే కాకుండా ఎదుగుదలలో, తెలివిలో మగాళ్లకు ఓ మొట్టు పైనే ఉంటున్నారు మహిళలు. దీనిని జీర్ణించుకోలేని కొంత మంది పురుషులు అక్కడ కూడా వాళ్లను ఆందోళనకు గురిచేస్తున్నారు.

ఈరోజుల్లో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే.. వర్క్ ప్లేస్‌లో పని భారం, ఒత్తిడి పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే.. పురుషులతో పోల్చుకుంటే మహిళలకు ఇంటి బాధ్యతలు కూడా అదనంగా ఉంటాయి. ప్రత్యేకించి వారు తమ డ్యూటీ టైమ్స్‌లో, ఎక్కువ పనిభారాన్ని కలిగి ఉన్నప్పుడు ఆఫీసులో ఆందోళన చెందడం, మానసికంగా ఎంతో టెన్షన్‌కు గురవ్వడం సాధారణం. ఇక కొన్నిసార్లు వర్క్‌ప్లేస్‌లో ఆందోళన అనేది పనిలో అన్యాయంగా వ్యవహరించే మేనేజర్ల వల్ల కూడా వస్తుంది. కొంత మంది పురుషులు అహంకారం చేత కూడా మహిళలు అణగదొక్కబడవచ్చు. ఈ కారణాలు మహిళల ఆత్మగౌరవాన్ని, మానసిక ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. ఇది కార్యాలయంలో ఆందోళనగా వ్యక్తమవుతుంది. అయితే, వర్క్‌ప్లేస్ యాంగ్జైటీని అధిగమించడానికి శ్రామిక మహిళలు కొన్ని చిట్కాలు పాటిస్తే ఆందోళ తగ్గించడంలో ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. సెల్ఫ్ కేర్

ప్రతి మహిళ ఆఫీసులో, ఇంట్లో ఎక్కడైన సరే ఒత్తిడిని తట్టుకోవాలంటే మొదట స్వీయ సంరక్షణ (సెల్ఫ్ కేర్) కు ప్రాధాన్యతను ఇవ్వడం చాలా అవసరం. దీని కోసం రోజు వ్యాయామం, తగినంత నిద్ర, అలాగే కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. ఇవన్ని మహిళలు తమ రోజు లైఫ్‌లో యాడ్ చేసుకున్నట్లయితే.. ఒత్తిడి, ఆందోళనను క్రమంగా తగ్గిస్తాయి. ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉండే ఇంటి బాధ్యతను, ఆఫీసులో వర్క్ టెన్షన్‌ను ఈజీగా హ్యాండిల్ చెయ్యగలుగుతారు.

2. టైం మెనేజ్మెంట్

మహిళలకు టైం మెనేజ్మెంట్ అనేది చాలా అవసరం. మనం సమయ నిర్వహణ నైపుణ్యాలను సక్రమంగా చేసుకోగలిగితే ఒత్తిడిని తగ్గింస్తుంది. ఏ పనిని ఏ టైంలో చెయ్యాలో ముందుగానే ఓ ప్రణాలికను సిద్ధం చేసుకోండి. ఆ టైంకి ఆ పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. ఈ కారణంగా ఏదైనా పెద్ద ప్రాజెక్టులు అయిన సులభంగా ఫినిష్ చెయ్యగలుతారు. అలా చక్కటి టైం టేబుల్‌ను రూపొందించడం వలన పని చేసే మహిళలు సమయాన్ని సమర్ధవంతంగా కేటాయించుకోగలుగుతారు. దీంతో పాటు పని ఒత్తిడి కూడా తగ్గుతుంది.

3. బౌండరీస్

ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యతను కాపాడుకోవడానికి సరిహద్దులను నిర్ణయించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మీ పనిని తక్కువగా అంచనా వేసే లేదా మిమ్మల్ని దూకుడు ప్రవర్తనకు గురిచేసే మేనేజర్‌తో వ్యవహరించేటప్పుడు సరిహద్దులను గీయడం, వారి దగ్గర స్ట్రాంగ్‌గా వ్యవహరించడం చాలా ముఖ్యం. అంతే కాకుండా మీ పని గంటలు, వ్యక్తిగత కట్టుబాట్లకు సంబంధించిన విషయాల గురించి మీ సహోద్యోగులు, ఉన్నతాధికారులతో స్పష్టంగా తెలియజేయండి.

4. స్ట్రాంగ్ సపోర్ట్

ఆఫీసుల్లో ఆందోళనను అధిగమించడానికి మనకు సపోర్ట్ చాలా అవసరం. మిమ్మల్నీ, మీ ప్రయత్నాలను అర్థం చేసుకుని అభినందించే సహోద్యోగులు, సలహాదారులు, స్నేహితులతో మాట్లాడండి. అనుభవాలను పంచుకోవడం, సలహాలు కోరడం వంటివి ఇతరుల నుండి సపోర్ట్‌ను, స్నేహన్ని పొందడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఏదైన ఒత్తిడిలో ఉన్నప్పుడు అలాంటి వారితో మాట్లాడటం కారణంగా ఆఫీసులో ఆందోళనను దూరం చేసి మిమ్మల్నీ సంతోషంగా ఉంచుతాయి.

5. బీ పాజిటివ్

వృత్తి విషయంలో ఆందోళనలు, ఒత్తిడిలు ఎదురవుతుంటాయి. కొన్ని కొన్ని సార్లు టెన్షన్‌ను తట్టుకోలేక పోతారు. అలాంటి సమాయాల్లో పాజిటివ్‌గా ఆలోచించగలగాలి. మీరు అనుకున్న ఒక పాయింట్ స్ట్రాంగ్‌గా కమ్యూనికేట్ చేయగలిగాలి. అంతే కాదు మన గురించి ఎవరైనా ఏదైన అనుకుంటారా అని చాలా మంది మహిళలు మాట్లాడటానికి కూడా వెనకడుగు వేస్తారు. అలా కాకుండా మనం ఏదైతే అనుకున్నామో దాన్ని స్ట్రాంగ్‌గా చెప్పగలిగితే.. అపార్థాలు తగ్గడమే కాకుండా వృత్తిపరమైన అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

6. యాక్టివ్

మీ ఫీల్డ్‌కు సంబంధించిన కొత్త విషయాలను నేర్చుకోడంలో, జ్ఞానాన్ని పొందడంలో యాక్టీవ్‌గా ఉండండి. నిరంతర అభ్యాసం వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించడమే కాకుండా విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. బాగా సిద్ధమైనట్లు, సమర్ధత కలిగి ఉన్నట్లు భావించడం వలన ఆఫీసులో ఒత్తిడి, ఆందోళనను తగ్గించవచ్చు. వీటితో పాటు వర్కింగ్ మైండ్‌సెట్‌తో సవాళ్లను స్వీకరించడానికి శ్రామిక మహిళలను శక్తివంతం చేయవచ్చు.



Source link

Related posts

మొక్క జొన్నలో అద్భుత పోషకాలు.. తినడంవల్ల కలిగే లాభాలివే..

Oknews

హార్ట్ ఫెయిలయ్యేముందు కనిపించే లక్షణాలు ఇవే..

Oknews

Electric massagers : ఎలక్ట్రిక్ మసాజర్లు వాడుతున్నారా?.. బీ కేర్ ఫుల్!

Oknews

Leave a Comment