Health Care

వర్షాకాలంలో కంటి సమస్యలు.. ఇన్ఫెక్షన్ల నివారణకు ఏం చేయాలంటే..


దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో సాధారణంగా కొన్ని సీజనల్ వ్యాధులు వ్యాప్తిస్తుంటాయి. పిల్లలు, పెద్దలు అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా ఎక్కువే. డెంగ్యూ, మలేరియా వంటి వైరల్ ఫీవర్లతోపాటు కంటి సమస్యలు కూడా తలెత్తే చాన్స్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వాయు, నీటి కాలుష్యాలు, అపరిశుభ్రత, ఆహారంలో మార్పులు ఇందుకు కారణం అవుతుంటాయి. అయితే ఈ సీజన్‌లో ఎలాంటి కంటి సమస్యలు తలెత్తుతాయి?, నిపుణుల ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కళ్లు పొడిబారడం

అప్పటికే కళ్లు పొడిబారే సమస్యతో బాధపడేవారికి వర్షాకాలంలో మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. తగినంత తేమ లేకపోవడం, కన్నీళ్లు ప్రొడ్యూస్ కాకపోవడం వంటి కారణాలతో ఈ డ్రై ఐ ప్రాబ్లం ఏర్పడుతుంది. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని కెరాటో కంజక్టివిటీస్ అంటారని నిపుణులు చెప్తున్నారు. అలాగే స్మార్ట్ ఫోన్, ట్యాబ్, కంప్యూటర్, వివిధ స్ర్కీన్లను ఎక్కువసేపు చూడటంవల్ల, రెప్పవేయని పరిస్థితుల్లో వర్క్ చేయడంవల్ల కూడా కళ్లు పొడిబారుతుంటాయి. ఇలాంటప్పుడు కంటి వైద్య నిపుణులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కళ్లకలక

పిల్లలు, పెద్దల్లో కండ్ల కలక వచ్చే అవకాశం వానాకాలంలో పెరుగుతుంది. కనురెప్పల లోపలి భాగం, ఐబాల్‌లోని తెల్లని భాగంలో ఉండే ఒక సన్నని పొర ఉబ్బి ఇన్ఫెక్షన్ ఏర్పడంవల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల కళ్లల్లో మంట, దురద, తరచుగా నీరు కారడం, కళ్లు ఎర్రబడటం వంటివి సంభవిస్తాయి. పైగా ఈ వైరల్ కంజక్టివిటీ అంటు వ్యాధి కూడాను. కాబట్టి ఇతరులకు సోకకుండా గ్లాసెస్ ధరించడం, డాక్టర్ల సలహాలు పాటించడం చేయాలి.

కార్నియల్ ఇన్ఫెక్షన్

కార్నియల్ ఇన్ఫెక్షన్ లేదా అల్సర్ అనేది కార్నియాలో ఏర్పడే ఇబ్బందికరమైన సమస్య. ఇది పుండు రూపంలో కూడా ఉండవచ్చు. దీనివల్ల కండ్లు ఎర్రబడతాయి. కళ్లల్లో నీరు కారడం, కొన్నిసార్లు రక్తం, చీము వంటివి కూడా కారడం జరగవచ్చునని నిపుణులు అంటున్నారు. కాబట్టి వర్షాకాలంలో కళ్లకు సంబంధించిన ఏ సమస్య తలెత్తినా అలర్ట్ అవ్వాలి. కంటి వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

నివారణ ఎలా?

వర్షాకాలంలో కంటి సమస్యలు, ఇన్ఫెక్షన్లను నివారించడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా చేతులు కడగకుండా కళ్లను పదే పదే తాకవద్దు. అలాగే కళ్లపై రాపిడి లేదా రుద్దడం వంటివి చేయకూడదు. ఒకరి కళ్లద్దాలను ఇంకొకరు వాడ కూడదు. బయట చల్లగాలిలో తిరగాల్సి వచ్చిన వారు సేఫ్టీ గ్లాసెస్ ధరించాలి. ప్రతి రోజూ శుభ్రమైన నీటితో మాత్రమే స్నానం చేయడం, మొహం కడగడం చేయాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ కూడా ఏదైనా సమస్యగా అనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాల నివృత్తి, సలహాల కోసం కంటి వైద్య నిపుణులను సంప్రదించగలరు.



Source link

Related posts

గుడ్డుతో ఆరోగ్యం మాత్రమే కాదు.. జుట్టు కూడా అందంగా ఉంటుంది.. ఎలాగో చూడండి..

Oknews

డిగ్రీ కన్నా స్కిల్స్ ముఖ్యం.. రిక్రూట్‌‌‌మెంట్ ప్రాసెస్‌లో నయా ట్రెండ్ !

Oknews

రూ.200ల చీరలో నగలు లేకుండా పెళ్లి కూతురుగా రాధిక..పడుకునేందుకు దుప్పట్లు సర్దుతున్న ముఖేష్ అంబానీ!

Oknews

Leave a Comment