దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు మాత్రమే కాదు, చర్మ సమస్యలు కూడా పెరిగే చాన్సెస్ ఉన్నాయని డెర్మటాలజిస్టులు అంటున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లలో స్కిన్ ఇన్ఫెక్షన్లు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కూల్ వెదర్, వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్ కారణంగా బ్యాక్టీరియల్ అండ్ ఫంగస్ అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందవచ్చునని వైద్య నిపుణులు కూడా పేర్కొంటున్నారు. దీనికి తోడు డయాబెటిస్ బాధితుల్లో షుగర్ లెవల్స్ పెరగడంవల్ల చర్మ సమస్యలు మరింత అధికం అవుతాయట. ఫలితంగా స్కిన్‌పై పుండ్లు ఏర్పడటం, దురద పుట్టడం వంటివి జరగవచ్చు.
రెయిన్ సీజన్‌లో ఇన్ఫెక్షన్లు సోకితే శరీరంలో కొల్లాజెన్ అనే హార్మోన్ తగ్గుతుంది. మధుమేహ బాధితుల్లో ఇది మరింత సమ్యగా మారుతుందని నిపుణులు చెప్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నివారణ చర్యలు పాటించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు చల్లటి వాతావరణంలో ఎక్కువగా తిరగడం లేదా తడిగా ఉండే బట్టలను తాకడం, ధరించడం వంటివి చేయకూడదట. అట్లనే వర్షం కురుస్తున్నప్పుడు రోడ్లపై పారే వరదనీటిలో నడవక కూడదు. వర్షంలో బయటి నుంచి వచ్చిన వారు వెంటనే వేడినీటితో స్నానం చేయాలి. ఒకవేళ చర్మంపై మంట, దురద, రంగు మారడం వంటివి కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. ఆహారం విషయానికి వస్తే షుగర్ పేషెంట్లు స్వీట్లు, ఐస్ క్రీములు, స్పైసీ ఫుడ్స్ తినకూడదని, దీనివల్ల చర్మ సమస్యలు మరింత అధికం అవుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. పండ్లు, తాజా కూరగాయలు ఆహారంలో భాగంగా తీసుకోవాలి.
* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.