Health Care

వర్షాకాలం మ్యాంగోస్టిన్ ఫ్రూట్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?


దిశ, ఫీచర్స్: మిగతా సీజన్లలో పోలిస్తే వర్షాకాలం వ్యాధులు మరింత పెరుగుతాయి. చల్లటి వాతావరణాన్ని శరీరం తట్టుకోకపోవడంతో.. అనేక రకాల సమస్యలు తలెత్తితూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా దోమల బెడద వల్ల వైరల్ ఫీవర్, ఫ్లూ, డెంగ్యూ, న్యుమోనియా, మలేరియా, వాంతులు, విరేచనాలు, కామెర్లు వంటి ప్రమాదకర సమస్యలు వస్తాయి. దీంతో చాలా మంది పలు ఇంట్లోంచి బయటకు రావడానికి కూడా భయపడిపోతుంటారు. ఒకవేళ వచ్చినా పలు రకాల చిట్కాలు పాటించి జబ్బుల నుంచి తమను తాము రక్షించుకుంటారు. అయితే వర్షాకాలం మ్యాంగోస్టిన్ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

*ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి జబ్బులు రాకుండా చేస్తుంది.

* మ్యాంగోస్టిన్ పండ్లు యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి కాబట్టి వీటిని తినడం వల్ల క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటాయి. అలాగే పలు రకాల అనారోగ్య సమస్యలను దరి చేరకుండా తరిమికొడతాయి.

* వర్షాకాలం జనాలను బాగా ఇబ్బంది పెట్టే జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులను మ్యాంగోస్టిన్ అడ్డుకోవడంతో పాటు శరీరానికి మేలు కలిగిస్తాయి.

*ఈ పండ్లు బీపీని కంట్రోల్ చేయడంతో పాటుగా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే ఇందులో ఫైబర్ ఉండి చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

* మ్యాంగోస్టిన్ పండ్లు ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతాయి.

* ముఖ్యంగా మహిళలకు ఈ పండు దివ్య ఔషదం వంటివి. ఎందుకంటే ఇవి నెలసరి సమస్యలను తగ్గించి ఉపశమనం ను కలిగిస్తాయి. కాబట్టి మ్యాంగోస్టిన్ పండ్లను తీసుకోవడం మంచిది. అలాగే అని అధికంగా తింటే అంత మంచిది కాదు మితంగా తినాలి.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ ఆధారంగా తీసుకున్నవి మాత్రమే. దీనిని దిశ ధృవీకరించదు.



Source link

Related posts

ఈ గ్రామంలో ఏ ఇంటికి తలుపులు ఉండవు.. కారణం ఏంటంటే?

Oknews

కళ్లద్దాలతో బాధపడుతున్నారా! అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Oknews

ఇంట్లోనే విటమిన్ సి క్రీమ్‌ను తయారు చేసుకోండి.. ఎలాగో తెలుసా..

Oknews

Leave a Comment