Health Care

వర్షాకాలం వాక్కాయలు తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో తెలుసా!


దిశ, ఫీచర్స్: వర్షాకాలంలో విరివిరిగా అందుబాటులోకి వచ్చేస్తాయి వాక్కాయలు. అయితే ఇవి చాలా మందికి తెలియదు. కానీ వాక్కాయలు పల్లెల్లో ఉండే వారికి పేరు చెప్పగానే నోట్లో నీరు ఊరుతాయి. ఈ కాయలను ఉప్పు కారం వేసుకుని ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాగే కొంతమంది కూరను వండుకోవడంతో పాటు పచ్చడి కూడా పెడతారు. ఇవి పూర్తిగా అడవులు గ్రామాల్లో మాత్రమే కనిపిస్తాయి. వీటి గురించి తెలియక చాలా తినడానికి ఇష్టపడరు. కానీ వాక్కాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇందులో ఫైబర్ అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం తొలగించడంతో పాటుగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది. విటమిన్‌ ఏ, విటమిన్‌ సి, ఫైబర్‌, ఫైటో న్యూట్రియంట్స్‌, అంథోసైనిన్స్‌, ఫినోలిక్‌ యాసిడ్స్‌ అధికంగా ఉన్నాయి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ పాలిఫినల్స్‌ వలన కణాలు దెబ్బతినకుండా, ఇన్ఫెక్షన్లకు రాకుండా రక్షిస్తుంది. ఆ కాయలు మధుమేహాన్ని తగ్గించడంతో పాటుగా దంతాలు పుచ్చిపోకుండా కాపాడుతాయి. వాక్కాయల రసాన్ని తాగడం వల్ల ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్, ఉబ్బసం, పిత్తాశయం, చిగుళ్లలో రక్తస్రావం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. వర్షాకాలంలో అందుబాటులో ఉండే వాక్కాయలను తినడం వల్ల ఈ సీజన్‌లో వచ్చే అంటువ్యాధులు సోకకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.



Source link

Related posts

1500 ఏళ్ల క్రితం మరణించిన రాజు.. DNA సాయంతో ముఖాన్ని రివీల్ చేసిన శాస్త్రవేత్తలు

Oknews

ఒత్తిడిలో ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తింటున్నారా?.. ఈ నిజాలు తెలిస్తే అస్సలు ముట్టుకోరు!

Oknews

దేవుడిని పూజిస్తే జీవితంలో సక్సెస్ ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది?

Oknews

Leave a Comment