దిశ, ఫీచర్స్ : ప్రతి ఏడాది మాఘమాసంలోని శుక్ల పక్షంలోని ఐదో రోజు వసంత పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం వసంత పంచమి 14 ఫిబ్రవరి 2024 న జరుపుకోనున్నారు. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం, ప్రేమికుల రోజు కూడా ఈ రోజునే జరుపుకుంటారు. వసంత పంచమి సరస్వతి తల్లికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున విజ్ఞానం, వాక్కు, తెలివి, వివేకం, సమస్త కళలు కలిగిన సరస్వతీ దేవిని పూజిస్తారు. వసంత పంతమి రోజున సరస్వతీ దేవిని పూజించడం ద్వారా సంగీతం, కళ, విద్యా రంగాల్లో విజయం సాధిస్తారని నమ్ముతారు. అలాగే శారదా మాత ఆశీస్సులు ఆమె భక్తుల పై ఎప్పుడూ ఉంటాయని భక్తుల నమ్మకం. వాస్తు శాస్త్రంలో తల్లి సరస్వతి విగ్రహానికి సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వసంత పంచమి రోజున మీరు ఈ నియమాలను పాటిస్తే, జ్ఞాన దేవత అనుగ్రహం మీపై ఉంటుందని పండితులు చెబుతున్నారు.
సరస్వతీ దేవి చిత్రాన్ని ఏ దిశలో అమర్చాలి ?
విద్యా సంబంధిత పనిలో విజయం సాధించడానికి, వసంత పంచమి రోజున ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో అమ్మవారి చిత్ర పటాన్ని లేదా విగ్రహాన్ని అమర్చాలి. ఇలా చేయడం వల్ల మీరు చేసే పనులకు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.
తూర్పు లేదా ఉత్తర దిశలో ఖాళీ స్థలం లేకపోతే, సరస్వతీ దేవి అనుగ్రహం పొందడానికి ఈశాన్య మూలను శుభ్రం చేసి, సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించవచ్చు.
ఇంట్లో సరస్వతీ మాత విగ్రహం తామరపువ్వు పై కూర్చున్న భంగిమలో ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, నిలబడి ఉన్న భంగిమలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించడం శుభపరిణామంగా పరిగణించరు.
అలాగే అమ్మవారి చిత్రపటం, విగ్రహం ఆశీర్వాదం ఇస్తున్న భంగిమలో ఉంటే మంచిదని చెబుతున్నారు.
విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని కొనుగోలు చేసేటప్పుడు విగ్రహం పగలకుండా చూసుకోండి. వసంత పంచమికి సరస్వతిని పూజించేటప్పుడు, పొరపాటున కూడా సరస్వతి మాత విగ్రహాలను రెండింటిని ప్రతిష్టించకూడదు.
సరస్వతీ మాత చిత్రపటాన్ని ఇంట్లో ప్రతిష్టించడం శుభప్రదంగా భావిస్తారు. మీరు స్టడీ రూమ్‌లో లేదా ఇంటి తూర్పుదిశలో అమ్మవారి చిత్రాన్ని కూడా పెట్టవచ్చు.
సరస్వతీ మాత విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం శ్రేయస్కరమా కాదా అని ప్రజలు తరచుగా ఆలోచిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, సరస్వతి దేవి చిత్రాన్ని తప్పనిసరిగా ఇంట్లో ఉంచాలి. అయితే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వీటిని అనుసరించి ఇంట్లో అమ్మవారి చిత్రాన్ని పెట్టవచ్చు. సరస్వతీ మాత చిత్రపటాన్ని ఇంట్లో ప్రదర్శించే విధంగా పెట్టకూడదు. ఇంట్లో విగ్రహాన్ని ప్రతిష్టించిన తరువాత నిత్యం పూజా కైంకర్యాలు చేయాలి. ఇలా చేస్తే అంతా శుభమే కలుగుతుందని పండితులు చెబుతున్నారు.