పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)కి తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (sai dharam tej)అంటే ఎంత ఇష్టమో.. అందులో ఇంచు కూడా తగ్గకుండా పవన్ అన్నా కూడా తేజ్ కి అంతే ఇష్టం. ఇందులో ఎవరు కూడా అనుమానించాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ కి ఐతే ఆ ఊహా కూడా రాదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సోషల్ మీడియాలో తాజాగా ఒక చర్చ జరుగుతుంది. దాని ప్రకారం ఆ ఇద్దరి మధ్య ఉన్న అభిమానానికి ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ అనుమానం అక్కర్లేదని తెలుస్తుంది.
తేజ్ ఇటీవల తండ్రి కూతురు బంధంపై అశ్లీలంగా మాట్లాడిన కేసులోప్రణీత్ హనుమంత్ జైలు పాలు అవ్వడంతో కీలక పాత్ర పోషించాడు. నిజానికి చాలా మంది ఆ వీడియోపై రియాక్ట్ అయ్యారు. ప్రణీత్ ని కఠినంగా శిక్షించాలని కోరారు. కానీ తేజ్ మాత్రం పట్టుబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy)కి ఫిర్యాదు చెయ్యడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి సదరు వీడియో షేర్ చేసిన అతన్ని కటకటాల వెన్కక్కి పంపించింది. ఇప్పుడు తేజ్ కి సోషల్ మీడియా వేదికగా ఇంకో సవాలు ఎదురయ్యింది. గతంలో కొంతమంది పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా బూతులతో మాట్లాడిన వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. పవన్ కళ్యాణ్ ని ఇంత పచ్చిగా బూతులతో తిడుతుంటే ఎందుకు రియాక్ట్ కాలేదని తేజ్ ని ప్రశ్నలు వేస్తున్నారు. అయితే తేజ్ దీనిపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ తేజ్ ఫ్యాన్స్ మాత్రం అందుకు సమాధానం చెప్తున్నారు. గతంలోనే ఒక ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ చేసిన కామెంట్స్ ని షేర్ చేస్తున్నారు. మావయ్య ని ఎవరన్నా తిడితే నాకు చాలా బాధేస్తుంది. అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చాక చరణ్(charan)వరుణ్, వైష్ణవ్ నాతో మాట్లాడారు. నా గురించి ఎవరైనా మాట్లాడితే మీరు అసలు రియాక్ట్ కావొద్దు. చాలా మంది నన్ను కావాలని అబ్యుజ్ చేస్తారు.
అలాంటి వాటిపై మీరు స్పందించొద్దు. ఒక వేళ రియాక్ట్ కావాలని అనుకుంటే పాలిటిక్స్ లోకి వచ్చి మాట్లాడండి. అలా కాకుండా మీ ప్రొఫెషన్ లో ఉంటూ నన్ను తిట్టారని వాటిపై రియాక్ట్ అవ్వొద్దు. నన్ను ఏమైనా అంటే మీకు కోపం వస్తుందని నాకు తెలుసు. కానీ వాటి గురించి నేను చూసుకుంటా. మీ కెరియర్ ని మీరు చూసుకోండి. మీ సపోర్ట్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుందని నాకు తెలుసు. మీరు ప్రత్యేకంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. సో ఈ రిటర్న్ వీడియో తో అన్ని డౌట్స్ కి క్లారిఫికేషన్ వచ్చినట్టయ్యింది.