AP Elections 2024 : గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల(Volunteers) ఎన్నికల విధులపై(AP Elections 2024) కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో వినియోగించవద్దని సీఈవోను ఆదేశించింది. అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లుగానూ వాలంటీర్లను అనుమతించొద్దని తెలిపింది. ఇక గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఎన్నికల విధులపైనా ఆదేశాలు ఇచ్చింది. వారికి ఓటర్ల వేలుకు ఇంకు పూసే విధులు మాత్రమే అప్పగించాలని పేర్కొంది. సచివాలయ సిబ్బందికి కీలక ఎన్నికల విధులు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. అయితే గ్రామ, వార్డు, సచివాలయ(Gram Ward Sachivalaya Staff) సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకునేందుకు అభ్యంతరం లేదని ప్రకటించింది. ఈ మేరకు సీఈవోకు పలు సూచనలు చేసింది. బీఎల్‌వోలుగా పనిచేసిన సిబ్బందిని పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని సూచించింది. వారికి పోలింగ్ రోజు (Polling Day)ఇతర పనులు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని సీఈవోకి రాసిన లేఖలో ఈసీ(EC) పేర్కొంది. ఎన్నికల సంఘం సూచనలతో సీఈవో(CEO) ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లు, అధికారులకు లేఖ రాశారు.