Health Care

వాల్యు మెట్రిక్ డైట్ అంటే ఏమిటి?.. అధిక బరువును ఎలా కంట్రోల్ చేస్తుంది?


దిశ, ఫీచర్స్ : ఇటీవల పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో అధిక బరువు ఒకటి. ఇది క్రమంగా డయాబెటిస్, కార్డియో వాస్క్యులర్ ఇష్యూస్, హార్ట్ ఎటాక్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి మొదట్లోనే కంట్రోల్ చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. బాధితులు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే బరువు తగ్గాలనే ఆశతో తక్కువ తింటూ ఇబ్బంది పడుతుంటారు. బలవంతంగా ఆకలిని చంపుకుంటూ పస్తులు ఉంటారు. అయితే ఇలా ఆకలిని కంట్రోల్ చేస్తూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా అధిక బరువు తగ్గించగల మార్గం ఒకటి ఉందని నిపుణులు చెప్తున్నారు. అదే ‘వాల్యుమెట్రిక్ డైట్’.

ఆకలిని కంట్రోల్ చేయకుండానే..

వాల్యు మెట్రిక్ డైట్‌లో భాగంగా కొద్ది మొత్తంలో తింటూనే కడుపు నిండేలా తగిన ప్రోటీన్స్, ఇతర పోషకాలు తీసుకుంటారు. ప్రోటీన్ లెవల్స్ అధికంగా ఉండి, తక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలు, పండ్లు ఈ డైట్‌లో యూజ్ చేస్తారు. దీనివల్ల ఆకలిని కంట్రోల్ చేసుకోకుండా అవసరం అయినప్పుడల్లా కొద్ది మొత్తంలో తింటూ అధిక బరువును తగ్గించుకుంటారు. ఇలా కొంతకాలం ప్రయత్నించడంవల్ల అధిక బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

ఆహారాలు మార్చుతూ..

తాజా పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, మిల్లెట్స్ వంటివి వాల్యు మెట్రిక్ డైట్‌లో భాగంగా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే బరువు తగ్గేందుకు మొదట జంక్ ఫుడ్స్, హై కేలరీలు తగ్గించి వీటిని ఎక్కువ తీసుకోవాలి. కడుపు నిండే వరకు ఎన్ని పండ్లు అయినా తినవచ్చు. ఆ తర్వాత వాటిని జంక్ ఫుడ్, పండ్లను తగ్గిస్తూ మిల్లెట్స్ మొదలుపెట్టాలి. పండ్లను తగ్గించి మిల్లెట్స్‌ను మెయిన్ మీల్‌గా తీసుకోవాలి. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రొటీన్స్, హెల్దీ ఫ్యాట్స్‌ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆకలిని కంట్రోల్ చేయకుండా శరీరానికి క్రమంగా కేలరీలు తగ్గించడమే వాల్యు మెట్రిక్ డైట్ ప్రధాన ఉద్దేశం. దీనికోసం బరువు తగ్గడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. జిమ్‌కు వెళ్లి ఖర్చు చేసుకోవాల్సిన అవసరం కూడా తప్పుతుంది.



Source link

Related posts

వాళ్ల సంగీతం.. పర్యావరణ హితం.. ఏం చేస్తారో తెలుసా?

Oknews

కుంభంలో అస్తమించనున్న శని.. ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు..?.. మీ రాశి ఉందా?

Oknews

మునక్కాయలు అతిగా తింటున్నారా.. అయితే, వీటి గురించి తప్పక తెలుసుకోండి

Oknews

Leave a Comment