Health Care

వాళ్లపై యాక్షన్ తీసుకుంటా.. వైరల్‌గా బర్రెలక్క వీడియో


దిశ, ఫీచర్స్: ఎన్ని చదువులు చదివిన గవర్నమెంట్ ఉద్యోగాలు రావు.. చివరికి బర్రెలు కాయడమే అనే వీడియోతో బర్రెలక్కగా ఫేమస్ అయింది శిరీష. తర్వాత నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో నా గొంతు వినిపిస్తా అంటూ.. గతేడాది జరిగిన తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా శిరీష పోటీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అనుష్యంగా నెట్టింట మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న శిరిష ఇప్పుడు పెళ్లికి సిద్ధం అయింది. మొదటి భర్తతో కొన్ని అనివార్య కారణాల చేత విడిపోయిన ఈమె ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటుంది. దీనికి సంబంధించిన ప్రతి వీడియోను, ఫొటోస్‌ను నెట్టింట షేర్ చేస్తుంది శిరిష. ఈ క్రమంలోనే ఇటీవల తన ప్రీ వెడ్డింగ్ షూట్‌కు సంబంధించిన వీడియో పెట్టింది. అయితే.. ఈ వీడియో గురించే ఇప్పుడు బర్రెలక్క యాక్షన్ తీసుకుంటా అంటుంది. అసలు ఏమైందంటే..

తాజాగా బర్రెలక్క తన ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఓ కొత్త సాంగ్‌ను రాయించుకుంది. ఆ సాంగ్ తన పేరు ‘శిరిష’ మీదే ఉండటం విశేషం. అయితే.. ఈ సాంగ్‌ను తన యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. దీంతో చాలా మంది అదే సాంగ్‌ను తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో కూడా పెట్టుకుంటున్నారట. దీనిపై శిరిష సీరియస్ అవుతూ.. ‘మా ప్రీ వెడ్డింగ్ షూట్ సాంగ్‌ను చాలా మంది డౌన్‌లోడ్ చేసుకుని వాళ్లు యూట్యూబ్ చానెల్‌లో పెట్టుకుంటున్నారు. నేను అయితే దీనిపై 100% స్ట్రైక్ వేస్తా. ఎందుకంటే మేము ఈ సాంగ్ కావాలని రాయించుకున్న. దీనిని ఎవరూ అప్‌లోడ్ చేసుకున్న వారికి క్లైమ్స్, స్ట్రైక్ వేస్తా. ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తు ఉండేలా, ఓన్లీ నా చానెల్‌లో ఉండేటా నేను స్పెషల్‌గా రాయించుకున్నాను. ప్లీజ్ ఎవరి చానెల్‌లో అప్‌లోడ్ చేసుకోవద్దు. నేను స్ట్రైక్ వేసిన తర్వాత ఎంటీ అక్క ఇలా చేశావని బాధ పడొద్దు’ అంటూ చెప్పొక్చొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Read More: వైరల్ అవుతున్న బర్రెలక్క ఎంగేజ్మెంట్ ఫోటోస్.. అబ్బాయి ఎవరంటే?





Source link

Related posts

తామే గొప్ప అనుకొని నష్టపోతున్న అబ్బాయిలు.. సమానం అనుకుంటేనే సమస్యలు దూరం!

Oknews

వసంత పంచమి వ్రత నియమాలు ఏంటో తెలుసా..

Oknews

బీన్స్‌ ని మీ డైట్ లో చేర్చుకుంటే.. ఆ సమస్యలన్నింటికీ బైబై చెప్పొచ్చు!

Oknews

Leave a Comment