కరోనా సమయం నుంచి బుల్లితెర నటులు చాలామంది తమ ఫామిలీస్ తో కలిసి వీడియోస్, రీల్స్, బ్లాగ్స్ అంటూ చాలా హాడావిడీ చేస్తూ అటు నటనతోను, ఇటు బ్లాగ్స్ తోనూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. భార్య భర్తలు సీరియల్స్ లో నటిస్తూ, ఇటు పర్సనల్ లైఫ్ లో జరిగే ఘటనలను వీడియోస్ రూపంలో యూట్యూబ్ లో పెట్టి సంపాదిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ బుల్లితెర నటులని నెటిజెన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. కారణం ఏమిటంటే..
బుల్లితెర నటులైన మానస-ప్రీతమ్ లు.. ఇద్దరు పిల్లలు కలిగాక మనస్పర్ధలతో విడిపోగా.. మానస పిల్లలతో కలిసి ఉంటూ ఆమె బ్లాగ్స్ ఆమే చేసుకుంటుంది. ఇక ప్రీతమ్ సింగిల్ గా కనబడుతున్నాడు. అయితే మహేశ్వరీ ఆమే భర్త శివ, మేఘన-ఇంద్ర నీల్, విష్ణు ప్రియా జంటలతో పాటుగా మానస-ప్రీతమ్ ల జంటలు కలిసి క్రేజీ కపుల్స్ అంటూ బ్లాగ్స్ చేసేవారు. ఇప్పుడు మానస-ప్రీతమ్ విడిపోయాక మానస ఎవ్వరిని కలవకుండా ఉంటే.. ప్రీతం అప్పుడప్పుడు మహి, విష్ణు, మేఘన బ్యాచ్ తో కలిసి కనబడుతున్నాడు. అయితే వీరు కలిసి వీడియో చేసినప్పుడల్లా నెటిజెన్స్ వీరిని ట్రోల్ చేస్తున్నారు.
మానసని-ప్రీతమ్ ని కలపొచ్చు కదా. మానస ఇద్దరు పిల్లతో కష్టపడుతుంది. ప్రీతమ్ తో కలిసి మీరు ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోస్ ఏమిటి, మీరంతా సంతోషంగా ఉన్నారు, వాళ్ళని కలపాలనే ఆలోచన మీలో ఎవ్వరికైనా ఉందా అంటూ పెట్టిన కామెంట్స్ తో హార్ట్ అయిన ఈజంటలు మూడు ఓ వీడియో చేస్తూ ఫైర్ అయ్యారు. మేఘన ఆమే భర్త ఇంద్రనీల్, మహి ఆమే భర్త శివ, విష్ణు ప్రియా ఆమే భర్త కలిసి మేము మానసని ప్రీతమ్ ని కలపడానికి ఏమి చెయ్యడం లేదు అని మీరు చూసారా, అయినా మాతో కలవాలని ప్రీతమ్ కోరుకుంటున్నాడు, కానీ మానసకే లేదు. అయినా ఆమే పిల్లలతో కష్టపడుతుంది, అది మీరు చూసారా.. ఆమే బ్లాగ్స్ ఆమె చేసుకుంటుంది.
అయినా వారు కలవాలని మీరు కోరుకుంటే ఆమె బ్లాగ్స్ లో కామెంట్స్ పెట్టండి. మాకు కాదు.. మా మీద అస్సహ్యంగా కామెంట్స్ పెడుతున్నారు. మాకూ మాట్లాడడం వచ్చు. మీరు ఒరిజినల్ నేమ్స్ తో మమ్మల్ని అడగలేని వారు.. మీరు మమల్ని కామెంట్ చేస్తారా అంటూ మేఘన, మహి, విష్ణు ప్రియాలు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నిజమే వారు విడిపోతే వీళ్ళు మాత్రం ఏం చేస్తారు.