Cash From Washing Machine : దేశవ్యాప్తంగా పలు షిప్పింగ్ కంపెనీల(Shipping Companies) కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు (ED Raids)చేసింది. ఈడీ తనిఖీల్లో భారీగా నగదు దొరికింది. ఈ సోదాల్లో వాషింగ్ మెషీన్ లో భారీగా నగదు(Cash From Washing Machine) దొరకడం కొసమెరుపు. విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణల కాప్రికార్నియన్ షిప్పింగ్ లాజిస్టిక్స్, దాని డైరకర్లు, అనుబంధ సంస్థల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ. 2.54 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ నగదులో కొంత భాగాన్ని వాషింగ్ మెషీన్‌లో దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. కాప్రికార్నియన్ షిప్పింగ్ లాజిస్టిక్స్ కంపెనీ, దాని డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామి, లక్ష్మీటన్ మారిటైమ్, హిందూస్తాన్ ఇంటర్నేషనల్, రాజ్‌నందిని మెటల్స్ లిమిటెడ్, స్టావర్ట్ అల్లాయ్స్ ఇండియా, భాగ్యనగర్ స్టీల్స్, వినాయక్ స్టీల్స్, వశిష్ట కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సంస్థల డైరెక్టర్లు, భాగస్వాములు సందీప్ గార్గ్, వినోద్ కేడియా, ఇతరుల ఇళ్లు, కార్యాలయ్యాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఈ సంస్థల కార్యాలయాలు ఉన్న దిల్లీ, హైదరాబాద్, ముంబయి, కురుక్షేత్ర, కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు.
Source link