దిశ, ఫీచర్స్ : లివ్ ఇన్ రిలేషన్ షిప్ అంటే కొందరు అసహ్యించుకుంటారు. మరికొందరు ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అంటూ వదిలేస్తారు. ఇక పట్టణాల్లో చాలా మంది తమకు నచ్చిన వ్యక్తులతో సహజీవనం చేస్తుంటారు. మరికొంత మంది పెళ్లికి ముందే కాబోయే భర్తతో సహజీవనం చేసి తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఇదంతా సిటీ కల్చర్.
ఇక పల్లెటూర్లలో ఇలాంటి విషయాలు మాట్లాడితే చాలు ఏదో తప్పు చేసినట్లుగా చూస్తుంటారు. అక్కడ సంప్రదాయాలు, పద్ధతులే ముఖ్యం అంటారు. ఒక అబ్బాయిని చూసినా, మాట్లాడినా అది తప్పు కిందే భావిస్తారు. కానీ ఓ ఊరిలో మాత్రం పెళ్లి చేసుకోకుండానే నచ్చిన వ్యక్తితో శృంగారమే కాదండోయ్, ఏకంగా పిల్లల్ని కూడా కనవచ్చునంట. ఇంతకీ ఆ ఊరు ఏది అనుకుంటున్నారా?
రాజస్థాన్, గుజరాత్ కొండలలో కరాసియా అనే గిరిజన తెగ ఉంది. అక్కడి ప్రజలు ఓ వింత ఆచారాన్ని పాటిస్తుంటారు.ఆ గ్రామంలోని గిరిజనులు లివ్ ఇన్ రిలేషన్ షిప్ మెటైన్ చేస్తుంటారు. ఈ గ్రామంలోని మహిళలు పెళ్లికాక ముందే తమకు నచ్చిన పురుషులతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్ మెటైన్ చేస్తారంట. అంతే కాకుండా వివాహానికి ముందే పిల్లల్ని కంటారు. ఆ తర్వాత తనకు నచ్చిన వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకుంటారు.
అది ఎలా అంటే? స్త్రీలు, పురుషులు సమావేశమవుతారంట. అందులో వారికి నచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని కొన్ని రోజుల పాటు అతనితో సహజీవనం చేస్తారంట. తర్వాత వారికి వారి కుటుంబ సభ్యులు ఘనంగా పెళ్లి చేస్తారు. ఒక వేళ అమ్మాయికి ఆ అబ్బాయి నచ్చకపోతే వారు విడిపోవచ్చునంట. ఈ వింత ఆచారం వీరు తమ పూర్వీకుల నుంచి పాటిస్తున్నట్లు అక్కడి గ్రామస్థులు తెలుపుతున్నారు.