ByGanesh
Fri 02nd Feb 2024 04:32 PM
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప పై ప్యాన్ ఇండియా మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న కన్నప్ప షూటింగ్ మేజర్ పార్ట్ న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లోనే తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించడం అడ్వాంటేజ్ అవుతుండగా.. ప్రతీ భాష నుంచి క్రేజ్ ఉన్న నటులు ఈ ప్రాజెక్ట్ లో భాగమవడంతో.. అందరి చూపు కన్నప్ప పైనే ఉంది.
మోహన్ లాల్, మోహన్ బాబు, శివ రాజ్ కుమార్ వంటి హేమాహేమీలు నటించడమే కాదు మంచు వారి నుంచి మూడో తరం కూడా ఈ కన్నప్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు వారసుడు అవ్రామ్ మంచు కన్నప్పతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. మహాభారత్ ఫేమ్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ ప్యాన్ ఇండియా చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తుండగా.. కన్నప్ప దసరాకి విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దసరా కి విడుదల చేస్తే సెలవులు కలిసొస్తాయనే ప్లాన్ లో మంచు విష్ణు కన్నప్ప ని దసరాకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా టాక్.
Kannappa bracing for Dasara sensation:
Manchu Vishnu Kannappa releasing on Dasara