విజయవాడ పార్లమెంటు నియోజక వర్గంతో పాటు గుంటూరు, ఏలూరు పార్లమెంటు నియోజక వర్గాల్లో బలమైన అభ్యర్థుల్ని పోటీకి దింపేందుకు సిద్ధం అవుతోంది. సామాజిక వర్గాల కోణంలో మూడు పార్లమెంటు నియోజక వర్గాలు టీడీపీకి కీలకం కావడంతో వాటిలో బలమైన అభ్యర్థుల్ని పోటీకి దింపాలని యోచిస్తోంది. కేశినేని రాజీనామా, గల్లా జయదేవ్ నిష్క్రమణతో విజయవాడ, గుంటూరు స్థానాలు ఖాళీ అయ్యాయి. గుంటూరులో ఆలపాటి రాజా పేరు, విజయవాడలో కేశినేని చిన్ని పేరు వినిపిస్తున్నా ఎంత వరకు ఖాయమనేది స్పష్టత లేదు.