విలన్ గా సినీ కెరీర్ ని ప్రారంభించి హీరో స్థాయికి ఎదిగిన నటులు చాలా మంది ఉన్నారు.అలాంటి వాళ్ళల్లో ఒకడు గోపీచంద్. తనదైన రోజున సినిమాని ఒంటి చేత్తో హిట్ చెయ్యగల కెపాసిటీ గోపీచంద్ సొంతం. తాజాగా ఆయనకి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు సినీ ప్రేమికులని ఆకర్షిస్తుంది.
గోపీచంద్ నయా మూవీ భీమా.అన్ని హంగులని పూర్తి చేసుకొని మార్చి 8 శివరాత్రి కానుకగా వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. దీంతో మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని గోపీచంద్ స్టార్ట్ చేసాడు. ఈ మేరకు ఈ రోజు ఉదయాన్నే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కి వెళ్లి అమ్మ వారిని దర్శనం చేసుకుంటాడు. ఆ తర్వాత అక్కడనుంచి గుంటూరు బయలుదేరి వెళ్లి ఆర్ వి ఆర్ అండ్ జెసి ఇంజనీరింగ్ కాలేజీ కి చేరుకుంటాడు. అక్కడ విద్యార్థులతో కలిసి భీమా మూవీ విషయాలని పంచుకుంటాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ నుంచి అధికారకంగా ప్రకటన కూడా వచ్చింది.
గోపీచంద్ సరసన మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ హీరోయిన్స్ గా చేస్తుండగా సినిమా రంగానికి చెందిన అతిరథ మహారధులందరు ఈ మూవీలో నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై గోపీచంద్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో కెకె రాధామోహన్ భీమాని నిర్మించాడు. కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తుండగా.కన్నడ దర్శకుడు హర్ష ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించాడు.