ఒక బడా హీరో మూవీ రిలీజ్ అయ్యింది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటిని పక్కకు నెట్టి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇంకో బడా హీరో మూవీ వచ్చింది. అది కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. మరో బడా హీరో వచ్చాడు. అది కూడా సేమ్. అంటే దీన్ని బట్టి ఏం అర్ధం అవుతుంది. విజయం ఎప్పుడు ఏ ఒక్కరి సొంతం కాదు అని. కానీ ఒక్కడు మాత్రం హీరో సొంతమే. దాన్ని మాత్రం ఎవరు మార్చలేరు. అతనెవరో కాదు అభిమాని. హీరోని అభిమానించినంత ఇదిగా ఇంకెవర్ని అభిమానించడు. పైగా తన అభిమానం కంటికి కనపడని దైవం కంటే గొప్పదని కూడా నిరూపిస్తాడు. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందో చూద్దాం.
ప్రముఖ అగ్ర హీరో ఇళయ దళపతి విజయ్ కి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించి కొన్ని లక్షల మంది అభిమానులని సంపాదించుకున్నాడు. తాజాగా తిరుపత్తూర్ లోని కదిరివేల్ కి చెందిన విజయ్ అభిమాని ఒకరు ఒక అరుదైన రికార్డుని సాధించాడు.పైగా విజయ్ పై తనకున్న అభిమానాన్ని చాటడం ద్వారానే తను ఆ ఘనతని సాధించాడు. విజయ్ గురించి 10 వేల పదాలతో ఒక కవిత రాసాడు. అందు కోసం 36 గంటల పాటు కష్టపడ్డాడు. ఏప్రిల్ 16 ఉదయం 11 గంటలకి రాయడం మొదలుపెట్టి ఏప్రిల్ 17 రాత్రి 11 గంటలకి ముగించాడు.దీంతో యూనివర్సల్ అచీవర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , ఫ్యూచర్ కలాం బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
ఇక తమిళనాట ప్రస్తుతం విజయ్ గిల్లి మూవీ రీ రిలీజ్ అయ్యి రికార్డు కలెక్షన్స్ ని సృష్టిస్తుంది. ఒక్క రోజులోనే 10 కోట్లు రూపాయలని కలెక్ట్ చేసింది. మహేష్ బాబు హీరోగా తెలుగులో వచ్చిన ఒక్కడు కి రీమేక్ గా ఆ చిత్రం రూపొందింది. ప్రస్తుతం విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చి తమిళ మున్నేట్ర కజగం అనే పార్టీని స్థాపించాడు.