తమిళ అగ్ర నటుడు విజయ్ (vijay)అండ్ లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) కాంబోలో గత సంవత్సరం అక్టోబర్ లో వచ్చిన మూవీ లియో(leo)తమిళంతో పాటు తెలుగులోను ఒకేసారి రిలీజ్ అయిన ఈ మూవీ మిశ్రమ టాక్ ని అందుకుంది. కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. చాలా రోజుల తర్వాత లియోకి సంబంధించిన న్యూస్ ఒకటి ట్రెండ్ అవుతుంది.
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా లియో ఇటీవలే జెమిని ఛానల్ లో టెలికాస్ట్ అయ్యింది. విజయ్ లాంటి సూపర్ స్టార్ సినిమా టీవీల్లో వస్తుందంటే జనం టీవీ లకి అతుక్కిపోయి చూస్తారని ఎవరైనా అనుకుంటారు.కానీ ఎందుకనో లియో మీద ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కేవలం 3 టి ఆర్పి రేటింగ్ మాత్రమే లియో కి వచ్చింది.దీంతో లియో మేకర్స్ అండ్ విజయ్ ఫ్యాన్స్ అండ్ ఛానల్ నిర్వాహకులు షాక్ అవుతున్నారు.
చిన్న చిన్న హీరోల సినిమాలకే టీవీ ల్లో ఒక మాదిరి టి ఆర్పి రేటింగ్ లు వస్తాయి. మరీ లియో కి ఎందుకు అంత తక్కువ రేటింగ్ వచ్చిందనేది ఎవరకి అర్ధం కావటం లేదు. లియో లో విజయ్ తో పాటు త్రిష,సంజయ్ దత్, అర్జున్ లాంటి భారీ భారీ కాస్టింగే ఉంది.