అనసూయ మీద సోషల్ మీడియాలో మళ్ళీ ట్రోల్ల్స్ మొదలయ్యాయి. సింబా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సింబా మూవీ టీమ్ ని మీడియా కొన్ని ప్రశ్నలు వేసింది. అందరూ చెప్పారు ఇక అనసూయ విషయానికి వచ్చేసరికి ఆమెను కూడా పాత విషయాలు అడిగారు. “మీ సినిమా ట్రైలర్ లో విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు అని మీరే పెట్టుకున్నారు కదా ? మరి మీకు విజయ్ దేవరకొండకు మధ్య ఇస్స్యూస్ సాల్వ్ ఐపోయినట్టేనా” అని అడిగేసరికి ” ఇప్పుడు ఆ విషయాల గురించి ఆలోచిద్దాం అనుకోవడం లేదు. ఈ మూవీ ద్వారా ఎలా ఐతే మెసేజ్ ఇద్దామనుకున్నానో అప్పుడు కూడా అలాగే ఒక మెసేజ్ ఇద్దామనుకున్నా. ఐతే స్టేజి మేనర్స్ కాదు అని ఊరుకున్నా. ఎవరికైనా ఒక ఫోకస్ లైం లైట్ ఉన్నప్పుడు వాళ్ళు పద్దతిగా ఉండాలి. ఆ పద్దతి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.
అసలు ఆ టైంలో మీరందరికీ ఎందుకు తప్పనిపించలేదు అని నేనే అడుగుదామనుకుంటా..మీ అందరి కోసం నేను అడిగాను” అని చెప్పింది. దీంతో మళ్ళీ టాపిక్ కాస్త విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చేసరికి నెటిజన్స్, విజయ్ దేవరకొండ ఫాన్స్ అంత మళ్ళీ అనసూయను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దాంతో ఆమె ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది. “మరీ ఇంత చాతకాని వాళ్ళలా ఉంటె ఎలాగండీ.. నిజంగా మీకు కాలుతుందంటే నా మీద కాదు.. అస్తమానం నేను ఏం పని చేసినా ఆ టాపిక్ లాగే వాళ్లని అనండి దమ్ముంటే.. కానీ మీరు అలా చేయరు కదా.. ఎందుకంటే మీకది చేతకాదు. మీ హీరో లాగా ఆడవాళ్లను ఉద్దేశించి బూతులు తిట్టడం వచ్చు. కదా పాపం. కదా పాపం.. నేను ఇప్పటికీ మీ అందరి కోసం ప్రార్థిస్తాను” అని పోస్ట్ చేసింది.