EntertainmentLatest News

విజయ్ దేవరకొండ మార్చి ఎగ్జామ్ పాస్ అవుతాడా! స్లిప్ లు ఇవ్వడానికి అవకాశం లేదు


షార్ట్ పీరియడ్ లో బిగ్ స్టార్ హోదాలో కొనసాగుతున్న హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda)కాకపోతే  గత కొంత కాలం నుంచి వరుస పరాజయాలని ఎదుర్కొంటున్నాడు.గత మూడు చిత్రాలైన లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ లలో విజయ్ నటనకి మంచి పేరే వచ్చింది. కానీ కథ, కథనాల్లో ఉన్న లోపాల వల్ల  ఫెయిల్యూర్స్ అయ్యాయి. దీంతో  ఇప్పుడు ఫ్యాన్స్ అందరు  విజయ్ కి హిట్ రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరి ఆశ తీరే మార్గం తాజాగా బయటకి వచ్చింది.

విజయ్ తన అప్ కమింగ్ మూవీని నాని  జెర్సీ ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి(gowtham thinnanuri)తో చేస్తున్న విషయం అందరకి తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్ చెయ్యలేదు.కానీ మూవీ రిలీజ్ డేట్ ని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది. నెక్స్ట్ ఇయర్ మార్చి 28 న వరల్డ్ వైడ్ గా  విడుదల చేస్తున్నామని, అదే విధంగా ఈ నెలలోనే అంటే అగస్ట్ లో ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా అనౌన్స్ చేస్తామని కూడా తెలిపింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కతున్న ఈ మూవీ మీద దేవరకొండ తో పాటు  ఫ్యాన్స్ కూడా  భారీ ఆశలే పెట్టుకున్నారు.

కొన్ని రోజుల క్రితం శ్రీలంక లో ఒక భారీ  షెడ్యూల్ ని  కూడా  కంప్లీట్ చేసుకుంది. దీంతో  60 శాతం కి పైగా  షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్నట్టు సమాచారం.ఇక హీరోయిన్ విషయంలో  రకరకాల పేర్లు వినిపిస్తున్నా కూడా ఇంకా అధికారకంగా ఎవర్ని ప్రకటించలేదు. వరుస హిట్ లతో జోరు మీద ఉన్న  అగ్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ లు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి.ఇది  విజయ్ నుంచి  వస్తున్న 12 వ చిత్రం. దిల్ రాజు, మైత్రి మూవీస్ లో కూడా దేవరకొండ రెండు సినిమాలకి కమిట్ అయ్యాడు. 

 



Source link

Related posts

వరుణ్ తేజ్ కి మద్దతుగా సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ 

Oknews

Types Of Discounts On Health Insurance Premiums Reduce Insurance Premiums Know Details

Oknews

హీరో,అతని తండ్రి దారుణ హత్య

Oknews

Leave a Comment