EntertainmentLatest News

విజయ్ దేవరకొండ వల్లనే కల్కి హిట్ అనడానికి  పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి


ఇప్పుడు వరల్డ్ వైడ్ మొత్తం  నాగ్ అశ్విన్(nag ashwin)పేరు మారుమోగిపోతుంది. కల్కి 2898 ఏడి (kalki 2898 ad)ని చూసిన ప్రతి ఒక్కరు విజువల్ గా  నాగీ ఒక అధ్భుతమైన  ప్రపంచాన్ని చూపించాడని అంటున్నారు. తెలుగు సినిమాకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాడనే కితాబు ని కూడా అందుకున్నాడు. పైగా కేవలం రెండే రెండు సినిమాలతో నాగీ  అంత గ్రాండ్ గా తెరకెక్కించడంపై  ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు  గూగుల్ మొత్తం నాగీ నామధేయంతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో వస్తున్న ఒక వార్త  పలువురిని ఆకర్షిస్తుంది.

కల్కి వరల్డ్ వైడ్ గా హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి.ప్రభాస్ (prabhas)ఫ్యాన్స్అయితే థియేటర్స్ దగ్గర  పూనకం వచ్చిన వాళ్ళల్లా ఊగిపోతున్నారు. ఇక ఇప్పుడు మూవీ చూసిన వాళ్లందరికీ ఒక డౌట్ వచ్చింది. నాగ్ అశ్విన్ కి కూడా తన మావయ్య అశ్వనిదత్( Aswani Dutt) లాగా  సెంటిమెంట్ పాళ్ళు బాగా ఎక్కువ అని. విషయం ఏంటంటే కల్కి లో ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ (vijay devarakonda)కనపడతాడు. కాసేపే అయినా కూడా   తన క్యారక్టర్ కి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు దేవరకొండ  విషయంలోనే నాగ్ అశ్విన్ కి సెంటిమెంట్ ఉందని  అర్ధమయ్యింది. పైగా అది హిట్ సెంటిమెంట్ అని క్లారిటీ వచ్చేసింది.  నాగీ ఫస్ట్ మూవీ ఎవడే సుబ్రమణ్యం. నాచురల్ స్టార్ నాని తో పాటు , విజయ్ దేవరకొండ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు. ఆ సినిమా హిట్. సెకండ్ మూవీ మహానటి. అందులోను దేవరకొండ  స్పెషల్ రోల్ లో కనిపించాడు. ఆ మూవీ కూడా హిట్. ఇప్పుడు కల్కి లో చేసాడు.  కల్కి కూడా హిట్.

ఇక కల్కి  సుమారు 600 కోట్ల బడ్జట్ తో తెరకెక్కింది. తొలి రోజే 200 కోట్లు వసులు చేసే దిశగా దూసుకెళ్తుంది. అదే కనుక జరిగితే ఇండియాలోనే తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డు సృష్టించనుంది. ప్రభాస్, అమితాబ్  బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని, శోభన, రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు తమ నటనతో సినిమాకి ప్రాణం పోశారు. మరో పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ కూడా అతిధి పాత్రలో మెరిశాడు.ఏది ఏమైనా   తెలుగు వారి కీర్తి  పతాకాన్ని కల్కి మరో మెట్టు ఎక్కించిందని భావించవచ్చు.

 

 



Source link

Related posts

Gold Silver Prices Today 08 March 2024 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Gold-Silver Prices Today: చుక్కలతో పోటీ పడుతున్న పసిడి

Oknews

BRS MLC Kavitha Requests Telangana Govt for allocation of funds for BC Welfare in TS Budget 2024 | Telangana Budget: బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి 20 వేల కోట్లు కేటాయించాలి

Oknews

BRS senior leaders change of party is being widely circulated | BRS Leaders : పార్టీ మారడం లేదు

Oknews

Leave a Comment