విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. తాము ఫ్రెండ్స్ మాత్రమే అని ఈ వార్తలను విజయ్-రష్మిక పలుసార్లు ఖండించినప్పటికీ.. ప్రేమ, పెళ్లి వార్తలకు బ్రేక్ పడట్లేదు. దానికి కారణం.. సీక్రెట్ గా వాళ్ళు వెకేషన్స్ కి వెళ్లడం, విజయ్ ఫ్యామిలీతో కలిసి రష్మిక పలు ఫెస్టివల్స్ సెలెబ్రేట్ చేసుకోవడం అని చెప్పవచ్చు. ఇలా విజయ్-రష్మిక తీరుని కొంతకాలంగా గమనించిన వారందరూ.. వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. అయితే ఆ అందరి అంచనాలకు నిజం చేస్తూ.. త్వరలోనే ఈ జోడి పెళ్లిపీటలు ఎక్కబోతుననట్లు తెలుస్తోంది.
విజయ్-రష్మిక ఈ ఏడాదే పెళ్లి చేసుకోబుతున్నారని, ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కి డేట్ కూడా లాక్ అయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆగష్టు రెండో వారంలో వీరి నిశ్చితార్థం జరగనుందని సమాచారం. అక్టోబర్ లేదా నవంబర్ లో పెళ్లి జరిగే అవకాశముంది అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఎప్పటిలాగే ప్రచారానికి పరిమితమవుతుందా? లేక ఈసారి నిజంగానే విజయ్-రష్మిక పెళ్లి పీటలు ఎక్కుతారా? అనేది త్వరలోనే తేలిపోనుంది.