Entertainment

విడాకుల కథ.. నాగచైతన్య నుంచి శర్వానంద్ కి!


గతేడాది ‘ఒకే ఒక జీవితం’ చిత్రంతో ఆకట్టుకున్న టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత తను చేయబోయే చిత్రానికి తాజాగా శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

ఈ ఏడాది జూన్ లో ‘సామజవరగమన’ చిన్న సినిమాగా విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ కామెడీ ఫిల్మ్ తో దర్శకుడు రామ్ అబ్బరాజు అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో అతని తదుపరి చిత్రం ఏ హీరోతో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. రామ్ అబ్బరాజు తన తదుపరి సినిమాని నాగ చైతన్యతో చేయనున్నాడని ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఈ కథ విడాకుల నేపథ్యంలో ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. అయితే కారణమేంటో తెలీదు కానీ.. ఇప్పుడు ఈ కథ శర్వానంద్ దగ్గరికి వెళ్ళిందట. రామ్ అబ్బరాజు చెప్పిన కథ నచ్చడంతో శర్వానంద్ వెంటనే ఓకే చెప్పినట్లు వినికిడి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీ అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని అంటున్నారు.



Source link

Related posts

ప్లీజ్ సాయం చేయండి.. నరేష్ విజయ్ కృష్ణ

Oknews

హాట్ స్పాట్ మూవీ రివ్యూ

Oknews

వయసుకి తగ్గ పాత్రలో చిరంజీవి.. ఈసారి ఏం చేస్తాడో..?

Oknews

Leave a Comment