హడలెత్తిన ఉపాధ్యాయులుపోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తున్న క్రమంలోనే కలెక్టర్ వీపీ గౌతమ్ సర్కార్ (Khammam Collector )మల్సూర్ తాండలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారితో కలిసి నేలపైనే కూర్చుని భోజనం(Midday Meals) పెట్టమని కోరారు. ప్లేట్ అందుకుని ఎంచక్కా భోజనం ఆరగించారు. పిల్లలతో ముచ్చటించి వారిని ఉత్తేజపరిచారు. మంచిగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. ఈ హఠాత్పరిణామంతో పాఠాశాల ఉపాధ్యాయులు హడలెత్తిపోయారు. ఏమైనా లోటుపాట్లు దొర్లుతాయేమోనని భయబ్రాంతులు చెందారు. చివరికి ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా కలెక్టర్ ప్రశాంతంగా వెళ్లిపోవడంతో పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కలెక్టర్ వెంట తల్లాడ మండల తహసీల్దార్ రవి కుమార్, ఎంపీడీవో చంద్రమౌళి, అధికారులు ఉన్నారు.
Source link
previous post