దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా వినోదానికి పెట్టింది పేరు. అయితే కొంత మంది విద్యాభివృద్ధికి, మరికొందరు సంపాదించేందుకు ఉపయోగిస్తున్నారు. అలాగే కొంతమంది కాలక్షేపం కోసం ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సోషల్ మీడియాలో Instagram చాలా ప్రసిద్ధి చెందింది. ఇన్స్టాగ్రామ్ లో విస్తృతంగా రీల్స్ చేస్తూ చాలామంది తెగ పాపులర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బీహార్‌కు చెందిన ఒక యువకుడు వైరల్ అయ్యాడు. అతను తన పెళ్లి నుండి హనీమూన్ వరకు రీల్స్ చేస్తూ తెగ వైరల్ అయ్యాడు. ఇప్పుడు అదే అబ్బాయికి సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది.
ఈ సారి ఈ అబ్బాయి విమానంలో కూర్చుని రీళ్స్ చేస్తూ కనిపించాడు. ఈ రీల్ లో యువకుడు అతనితో పాటు అతని భార్య కూడా కనిపించారు. హనీమూన్ కోసం ఇండిగో విమానంలో ఎక్కడికో వెళ్తున్నాడని, ఈలోగా రీల్ కూడా తీస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. క్రాంతివీర్ చిత్రంలోని ‘ధడ్కనేన్ బెచైన్ హై, క్యా హసీన్ ఖ్వాబ్ హై’ పాటపై అతను రీల్ చేశాడు. అందులో అతని భార్య కూడా సపోర్ట్ చేసింది. సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఈ కొత్త వీడియో @Prashantsonibps అనే ఐడీతో ట్విట్టర్‌లో షేర్ చేశారు.
Relax guys abhi honeymoon wali reel baaki hai😂 pic.twitter.com/wyCQVRVRRL
— Prashant Soni (@Prashantsonibps) February 24, 2024