EntertainmentLatest News

విలన్‌ హీరో అయ్యాడు.. ‘అహో విక్రమార్క’గా ఆగస్ట్‌ 30న వస్తున్నాడు!


‘మగధీర’ చిత్రంలో విలన్‌గా నటించి అందర్నీ ఆకట్టుకున్న నటుడు దేవ్‌ గిల్‌. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో విలన్‌గా రాణించిన దేవ్‌ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  దేవ్‌ గిల్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌పై ఎస్‌.ఎస్‌.రాజమౌళి శిష్యుడు పేట త్రికోటి దర్శకత్వంలో ‘అహో విక్రమార్క’ పేరుతో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో మాస్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆగస్ట్‌ 30న ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. 

హీరో దేవ్‌ మాట్లాడుతూ ‘అహో! విక్రమార్క’ చిత్రంలో  పోలీసుల ధైర్యం, అంకిత భావాన్ని గొప్పగా చూపించబోతున్నాం.  సినిమా చాలా బాగా వచ్చింది. ఆగస్ట్‌ 30న పాన్‌ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నాం. ఈ సినిమాలో నటుడిగా నన్ను మరో కోణంలో చూస్తారు’ అన్నారు. 

దర్శకుడు పేట త్రికోటి మాట్లాడుతూ ‘అహో! విక్రమార్క’ సినిమా పోలీసుల పవర్‌ను తెలియజేసేది. సినిమాను అనుకున్న ప్లానింగ్‌ ప్రకారం రూపొందించాం. ఫస్ట్‌ లుక్‌, టీజర్‌లకు చాలా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు.

 



Source link

Related posts

Balamuri Venkat And Mahesh Kumar Goud As Congress MLC Candidates In The MLA Quota | Telangana Congress MLC List : చివరి క్షణంలో అద్దంకి దయాకర్ పేరు మిస్

Oknews

అల్లూరి సీతారామరాజు విషయంలో ప్రభాస్, చరణ్ ఫ్యాన్స్ మధ్య వార్ 

Oknews

Third list of Janasena candidates జనసేన మరో జాబితా రిలీజ్..

Oknews

Leave a Comment