Top Stories

విశాఖ బయట పడేస్తాం.. స్ట్రాంగ్ వార్నింగ్ !


విశాఖ ఇపుడు అత్యంత కీలక నగరంగా మారుతోంది. మరి కొద్ది రోజులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు మకాం మారుస్తున్నారు. కేంద్రం కూడా నీతి అయోగ్ సెలెక్షన్ లో సౌతిండియాలో వన్ అండ్ ఓన్లీగా విశాఖను 2047 నాటికి గ్రోత్ ఇంజన్ సిటీగా డెవలప్ చేయడానికి నిర్ణయించింది.

విశాఖ ప్రాముఖ్యత అమాంతం పెరిగిపోతున్న వేళ రౌడీ షీటర్లు చికాకు పెడుతున్నారు. లా అండ్ ఆర్డర్ విశాఖలో కంట్రోల్ లో ఉంచడానికి అడిషనల్ డీజీని తెచ్చి మరీ సిటీని ఆ లెవెల్ లో ప్రమోట్ చేసిన నేపధ్యంలో కట్టుదిట్టంగా అంతా చూస్తున్నారు.

ఈ క్రమంలో రౌడీ షీటర్లను అందరినీ పిలిచి  క్లాస్ తీసుకున్నారు. తిన్నగా ఉంటే మర్యాద ఉంటుంది.  మంచి ప్రవర్తనతో ఉంటే రౌడీ షీట్లను కూడా ఎత్తి వేస్తామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.అలా కాకుండా పాత పద్ధతిలో సెటిల్మెంట్లు చేసుకుంటూ లా అండ్ ఆర్డర్ ని దెబ్బతీయాలనుకుంటే సిటీ నుంచి ఏరి పారేసి  విశాఖ అవతల వేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు.

లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయ్యేలా చేస్తే కఠిన చర్యలకు వెనకాడబోమని స్పష్టం చేశారు. విశాఖలో దాదాపుగా నాలుగు వందల మంది దాకా రౌడీ షీటర్లు ఉన్నారు. ఇపుడు వీరి మీద పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి అదుపు తప్పకుండా యాక్షన్ లోకి దిగుతున్నారు. రౌడీ షీటర్లు హద్దు మీరితే నగర బహిష్కరణ వేటు పడుతుంది అంటున్నారు. రౌడీస్ లో మార్పులు వస్తాయా లేదా అన్నది పోలీసుల యాక్షన్ ని బట్టి ఆధారపడి ఉంటుందని అంటున్నారు.



Source link

Related posts

సలార్ ట్రయిలర్ రిలీజ్.. ప్రభాస్ వస్తాడా రాడా..?

Oknews

జ‌న‌సేన స‌హ‌నానికి పరీక్ష‌

Oknews

స్కంద నుంచి పూర్తిగా బయటకొచ్చిన హీరో

Oknews

Leave a Comment