బీచ్ క్లీన్ కార్యక్రమం
తాను నటిచింన వెబ్ సీరీస్ “మిస్ పెర్ఫెక్ట్ ” ప్రమోషన్ లో భాగంగా బీచ్ క్లీన్ కార్యక్రమంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు. వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీచ్ క్లీనింగ్ లో మిస్ పర్ఫెక్ట్ టీం, డిస్నీ హాట్ స్టార్ సంయుక్తంగా ఈ కార్యక్రమంలో బాగస్వాములు అయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని అనేక సూపర్ హిట్ సినిమాలు ఇక్కడే షూట్ చేశారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలతో పాటు నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బీచ్ క్లీనింగ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.