Top Stories

విశాఖ రాజధాని అంటే ఎర్రన్నలకు మంటెందుకు…?


వామపక్షాల ప్రధాన సిద్ధాంతం బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకుని రావడం. అలాగే వెనకబడిన ప్రాంతాలకు ప్రగతిపధంలోకి నడిపించడం. అమరావతి రాజధాని అంటే అది వేలాది పంట భూములను ద్వంసం చేసి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించే రాజధాని అని విమర్శలు ఉన్నాయి.

ఉమ్మడి పదమూడు జిల్లాల ఏపీకి అంతటి పెద్ద రాజధాని అవసరం ఉందా అన్నది ఒక విషయం అయితే అంతటి రాజధానిని నిర్మించే తాహతు ఉందా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. ప్రజా రాజధాని అని వామపక్షాలు నినదిస్తే సబబుగా ఉంటుంది కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వేలాది ఎకరాలు తీసుకుని రాజధాని పేరిట దందాలు చేస్తున్నారు అని ఆరోపణలు ఉన్న చోట తటస్థంగా వామపక్షాలు ఉంటే బాగుంటుంది అని అంటున్నారు.

విశాఖలో రాజధాని అంటే ఉత్తరాంధ్రా వంటి వెనకబడిన ప్రాంతాలకు ఊతంగా ఉంటుంది అందరికీ తెలిసిందే. అలాంటి చోట రాజధాని పేరిట కానీ లేక సీఎం నివాసం పేరిట కానీ ప్రగతి జోరందుకుంటే లాభం బడుగులకే కదా అన్నది అందరి మాట.

కానీ వామపక్షాలు అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేయడం విడ్డూరమే అంటున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అమరావతి నుంచే పాలించాలని కోరడంలో ఆంతర్యం ఏమిటి అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. రాజకీయంగా విభేదిస్తూ తాము నమ్మిన సిద్ధాంతాలను కామ్రేడ్స్ మరచిపోతున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సీపీఐ, సీపీఎం బూర్జువా పార్టీల బాటన నడుస్తూ వారి నినాదాన్ని తాముగా చేసుకోవడం పట్ల మాత్రం విస్మయం వ్యక్తం అవుతోంది అంటున్నారు.



Source link

Related posts

గులాబీలకు కరెంటు షాక్!

Oknews

బ్యూటిఫుల్ గా విచారణ చేస్తున్నారన్న నవదీప్

Oknews

బాబు ప్రాణానికి ముప్పు.. వైసీపీ హత్య చేసుకున్నట్లే..!

Oknews

Leave a Comment