మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్. శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన తాజా వార్త ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ ని ఉలిక్కిపడేలా చేసింది.
గేమ్ చేంజర్ షూటింగ్ హైదరాబాద్ నగర శివారులో ఉన్న ఒక పారిశ్రామిక వాడలోని కెమికల్ ఫ్యాక్టరీ లో జరుగుతుంది. సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ కెమికల్ ఫ్యాక్టరీ అత్యంత ప్రమాదకరమైన విష వాయువులు తో కూడుకొని ఉన్న ఫ్యాక్టరీ. దీంతో యూనిట్ షాట్ గ్యాప్ లో చరణ్ ని తన క్యారవాన్ లో కి వెళ్ళమని చెప్పారు. కానీ చరణ్ మాత్రం తన క్యారవాన్ లోకి వెళ్లకుండా లొకేషన్ లోనే మాస్క్ లాంటిది ధరించి అక్కడే ఉన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్తలని చూసిన మెగా ఫ్యాన్స్ అందరు కంగారు పడ్డారు. కొంత మంది ఫ్యాన్స్ అయితే చరణ్ కి వర్క్ పట్ల ఉన్న డెడిషన్ కి హాట్స్ ఆఫ్ చెప్పడంతో పాటు తన తండ్రి చిరంజీవిలా చరణ్ సినిమా కోసం ఎంత కష్టమైనా పడతాడని అంటున్నారు.
గేమ్ చేంజర్ ఈ దసరాకి రావాలని శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం దర్శకుడు శంకర్ భారతీయుడు 2 షూటింగ్ ని కూడా చేస్తుండటంతో గేమ్ చేంజర్ డిలే అవుతు వస్తుంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుండగా చెర్రీ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడనే టాక్ అయితే వినపడుతుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో సీతగా చేసి మెప్పించిన అంజలి కూడా గేమ్ చేంజర్ లో నటిస్తుందనే ప్రచారం ఉంది.