టాలీవుడ్ హీరో విష్ణు మంచు కథానాయకుడిగా నటిస్తోన్న హిస్టారికల్ మూవీ ‘భక్తకన్నప్ప’. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీని రూ.150 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపొందించే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నారని రీసెంట్‌గానే విష్ణు ప్రకటించారు. అయితే తాజాగా ఆయన ‘భక్త కన్నప్ప’ సినిమాకు సంబంధించి చేసిన మరో ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ లేటెస్ట్‌గా విష్ణు చేసిన ట్వీట్ దేనికి సంబంధించో తెలుసా.. హీరోయిన్ నుపూర్ సనన్‌కి సంబంధించింది.
నిజానికి భక్త కన్నప్ప సినిమా లాంచింగ్ వేడుకలో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫేమ్ నుపూర్ సనన్ (బాలీవుడ్ స్టార్ కృతి సనన్ చెల్లెలు) హీరోియన్‌గా నటిస్తుందని ప్రకటించారు. ఆమె సైతం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంది. అయితే ఇప్పుడు నుపూర్ సనన్ ఈ మూవీ నుంచి తప్పుకుందని విష్ణు తెలిపారు. డేట్స్ అడ్జస్ట్‌మెంట్‌లో వచ్చిన సమస్య కారణంగా ఆమె సినిమా నుంచి తప్పుకుందని ఆయన పేర్నొన్నారు. తనతో భవిష్యత్తులో తప్పకుండా కలిసి పని చేస్తానని కూడా తను ఆయన పేర్కొన్నారు.
ఇంకా సెట్స్ పైకి వెళ్లక ముందే ‘భక్త కన్నప్ప’ మూవీ నుంచి హీరోయిన్ తప్పుకోవటంపై నెటిజన్స్ విష్ణుపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేయటం మొదలు పెట్టారు. ఫ్రీగా చేయమంటే ఎలా.. డబ్బులివ్వాలని ఒకరంటే.. అసలు ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రభాస్ కూడా తప్పుకోవాలని మరొకరు అన్నారు. హీరోయిన్ తప్పించుకుంది.. ప్రభాస్ కూడా తప్పించుకుంటే బావుంటుందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంకా కొందరైతే శ్రుతి మించిన కామెంట్స్ కూడా చేశారు.
‘భక్త కన్నప్ప’ సినిమాను న్యూజిలాండ్‌లో చిత్రీకరించటానికి విష్ణు సిద్ధం చేసుకున్నారు. తను టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని విష్ణు మంచి ఇది వరకే పేర్కొన్న సంగతి తెలిసిందే.