ఒక్క ఫ్లాప్ తో ఇంటికెళ్లిపోయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అదే టైమ్ లో వరుస ఫ్లాపులొచ్చినప్పటికీ అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. శ్రద్ధా శ్రీనాధ్ రెండో టైపు. ఈమె ఇప్పుడు మరో ఛాన్స్ అందుకుంది.
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమా మెకానిక్ రాకీ. మొన్నటివరకు ఇందులో మీనాక్షి చౌదరి మాత్రమే హీరోయిన్ అనుకున్నారు. కట్ చేస్తే, ఈరోజు శ్రద్ధా శ్రీనాధ్ పేరు ఎనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
ఈ ఏడాది సైంధవ్ సినిమాతో థియేటర్లలోకి వచ్చింది శ్రద్ధా శ్రీనాధ్. ఆ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో శ్రద్ధా పనైపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మెకానిక్ రాకీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది.
తెలుగులో ఆమె తక్కువగా సినిమాలు చేస్తోంది. జెర్సీతో మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఆ తర్వా, జోడీ సినిమాతో ఫ్లాప్ అందుకుంది. కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాతో ఓ మోస్తరు సక్సెస్ కొట్టింది. ఆ సినిమా తర్వాత పూర్తిగా టాలీవుడ్ కు దూరమై, సైంధవ్ తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మెకానిక్ రాకీ సినిమా చేస్తోంది.