EntertainmentLatest News

వెంకీ గురించి రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్


మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో టాప్-5 సినిమాలు ఏవంటే చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. టాప్-5 లో ప్లేస్ కోసం చాలా సినిమాలు పోటీ పడతాయి. కానీ రవితేజ మాత్రం తన కెరీర్ లో టాప్-5 సినిమాలలో ‘వెంకీ’ ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు.

రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా రవితేజ అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘వెంకీ’ సినిమా ప్రస్తావన తీసుకొచ్చాడు. వెంకీ తన ఫేవరెట్ మూవీ అని, ఇప్పటికీ ఆ సినిమాని ఎంతో ఎంజాయ్ చేస్తానని అభిమాని అన్నాడు. వెంటనే రవితేజ మాట్లాడుతూ “నీకే కాదు నాకు కూడా ఇష్టమైన సినిమా. నా టాప్-5 సినిమాలలో వెంకీ ఉంటుంది” అని చెప్పారు.

నిజంగానే వెంకీ అనేది రవితేజ కెరీర్ లో స్పెషల్ మూవీ. ఆయన టాప్-5 సినిమాలలో ఉండే అర్హత వెంకీ కి ఉంది. 2002 లో ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు,’ ‘ఇడియట్’, ‘ఖడ్గం’, 2003 లో ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ వంటి సినిమాలతో ఆకట్టుకొని హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న రవితేజను యువతకు, మాస్ కి ఎంతగానో చేరువ చేసి ఒక్కసారిగా కెరీర్ కి బూస్ట్ ఇచ్చిన చిత్రం వెంకీ. ‘నీకోసం’ తర్వాత రవితేజ, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఇది. 2004 వేసవిలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కష్ట పడకుండా జాతకాన్ని నమ్ముకుంటూ జీవితం మారిపోతుందని కలలు కనే మధ్యతరగతి యువకుడిగా రవితేజ తన నటనతో కట్టిపడేసారు. అప్పటిదాకా హీరో పాత్రలంటే ఇలాగే ఉండాలనే అభిప్రాయాన్ని వెంకీ పోగొట్టింది. అందులో హీరో పాత్ర.. లేని హీరోయిజం జోడించకుండా.. నేచురల్ గా, కామెడీగా.. నిజ జీవితంలో విలేజ్ లో ఉండే కొందరు కుర్రాళ్ళ జీవితానికి అద్దంపట్టేలా ఉంటుంది. అందుకే వెంకీ పాత్రకు ప్రేక్షకులు అంతలా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాలో కామెడీ అనేది హైలైట్. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ అయితే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టాడు. సినిమా వచ్చి 19 ఏళ్ళు దాటినా ఇప్పటికే అందులోని సన్నివేశాలను ప్రేక్షకులు పదే పదే చూసి ఎంజాయ్ చేస్తున్నారనే.. ఆ సన్నివేశాల్లో ఉన్న పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. బలమైన కథాకథనాలు, హీరో పాత్ర, కామెడీ సన్నివేశాలు, బ్యూటిఫుల్ మ్యూజిక్.. అన్నీ తోడై ఈ సినిమాని రవితేజ కెరీర్ లో బెస్ట్ ఫిలిమ్స్ లో ఒకటిగా నిలిచేలా చేశాయి.



Source link

Related posts

రెండు వసంతాలు పూర్తి చేసుకున్న 'ఆర్ఆర్ఆర్'

Oknews

telangana police clarity on fake news circulated through social media on childrens kidnap gangs | Childrens Kidnap: రాష్ట్రంలో పిల్లల కిడ్నాప్ ముఠాల సంచారం

Oknews

Eagle public rating viral కావాలనే ఈగల్ పై కక్ష గట్టారా

Oknews

Leave a Comment