Entertainment

వెన్నెల కిషోర్ హీరో..మూడునెలల్లో పాట రాసిన రామజోగయ్య శాస్త్రి


డిఫరెంట్ కామెడీ టైమింగ్ తో వెండి తెర మీద నవ్వులు పూయించే నటుడు వెన్నెల కిషోర్. ఆయన కామెడీ పండించిన  ఎన్నో చిత్రాలు ఆయన కామెడీ వల్ల  హిట్ రేంజ్ ని కూడా పెంచుకున్నాయి.ఇప్పుడు సోలో హీరోగా చారి 111 అనే మూవీ తో  ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. స్పై యాక్షన్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఆ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది.

చారి 111 కి అదితి సోనీ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఆమె  నిన్న జరిగిన ఫంక్షన్ లో మాట్లాడుతు మూవీలో వెన్నెల కిషోర్ కామెడీగా సూపర్ గా ఉంటుందని  ప్రతి ఒక్కరు ఆయన  కామెడీ ని చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పింది. అలాగే  నిర్మాతగా చారి తన తొలి సినిమా అని  ఇక పై రెగ్యులర్ గా  సినిమాలు నిర్మిస్తానని కూడా ఆమె చెప్పింది.అలాగే మూవీలో ఉన్న ఒకే ఒక్క పాట రాసిన రామజోగ్గయ్య శాస్త్రి మాట్లాడుతు పాట అధ్బుతంగా రావడం కోసం  మూడు నెలల సమయం తీసుకున్నానని ఆయన చెప్పాడు.

 

వెన్నెల కిషోర్ వన్ మాన్ షో గా తెరకెక్కుతున్న చారి 111 లో సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ గా చేస్తుండగా మురళి శర్మ, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు. టి జె కీర్తి కుమార్ దర్శకుడు కాగా ఈయన ఇంతకుముందు  మళ్ళీ  మొదలయ్యింది అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. సైమన్ కె కింగ్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. మార్చి 1 న చారి 111  విడుదల కాబోతుంది.

 


 



Source link

Related posts

36 Days వెబ్ సిరీస్ రివ్యూ

Oknews

నాకు నీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇవ్వొద్దు…హీరోలంతా ఫెమిస్టులు అయిపోతారు

Oknews

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా.. పవర్ ఫుల్ రోల్ లో విజయశాంతి!

Oknews

Leave a Comment