Health Care

వెరీ షార్ప్.. కుక్కలపై తాజా అధ్యాయనంలో బయటపడ్డ నమ్మలేని నిజాలు


దిశ, ఫీచర్స్: ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్ డాగ్స్ ఉంటున్నాయి. చాలా మంది కుక్కలను కూడా తమలో ఒకటిగా పెంచుకుంటున్నారు. వాటి ఆలనా పాలనా చూడటమే కాకుండా.. వాటిని స్నేహితులుగా, బంధువులుగా కూడా భావిస్తారు. ఇక కుక్కులకు కూడా మనిషి భాషను, భావాలను అర్థం చేసుకునే పవర్ ఉందని అందరికీ తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు కుక్కలపై చాలా అధ్యయనాలు జరిగాయి. ఇక తాజాగా జరిపిన అధ్యయనంలో మనం వాటి గురించి అంచనా వేసిన దాని కంటే లోతైన అవగాహనను డాగ్స్ కలిగి ఉండవచ్చని కొత్త పరిశోధన సూచిస్తుంది. ఇప్పటి వరకు యజమానుల పదాలకు ప్రతిస్పందించడం తెలిసిన కుక్కలు.. ఆ పదాల అర్థాలను కూడా అర్థం చేసుకోగలవట. ఇందుకోసం కుక్కల మెదడు కార్యకలాపాల రికార్డింగ్ ఆధారంగా ఈ ఫలితాలను రూపొందించారు పరిశోధకులు.

ఈ మేరకు వివిధ జాతులకు చెందిన 19 కుక్కలపై ప్రయోగాలు జరిపారు పరిశోధకులు. ప్రయోగం తర్వాత డాగ్స్ కుర్చోవడం, తమ కమాండర్స్‌ను పట్టుకోవడం వంటి చిన్న ఆదేశాల కంటే చాలా ఎక్కువ అర్థం చేసుకోగలవని తెలిపారు. ఈ పరిశోధన ప్రకారం.. కుక్కలు ముందు కొన్ని వస్తువులు ఉంచి వాటిని పిలిచినప్పుడు వాటి మెదడు ఎలా స్పందిస్తుందో తెలుసుకున్నారట. ఉదాహరణకు.. డాగ్ ముందు ఓ బాలు (బంతి)ని పెట్టి దానిని వేరే పేరుతో పిలిచారట. అయితే.. ఆ పేరు తన ముందు పెట్టిన వస్తువుతో సరిపోలనప్పుడు డాగ్స్ వివిధ రకాల సంకేతాలు ఇచ్చాయట. ఈ ప్రయోగం ఉద్దేశ్యం ఏమిటంటే.. మునుషులే కాకుండా కుక్కలు కూడా పదాల భావాన్ని అర్థం చేసుకోగలవని చెబుతున్నారు పరిశోధకులు.



Source link

Related posts

రెండేళ్లలో మరింత వేడెక్కిన సూర్యుడు.. 2025లో ఏం జరగనుందో !

Oknews

పరిస్థితులను, దృశ్యాలను ఊహించుకోలేని మానసిక రుగ్మత.. అఫాంటాసియా గురించి విన్నారా?

Oknews

జీన్స్ ప్యాంట్ ఎక్కువ బ్లూకలర్‌లోనే ఎందుకు ఉంటుందో తెలుసా?

Oknews

Leave a Comment