Veligonda Project : ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని ప్రాంతాలకు నీరు అందించే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులు 2021 జనవరి 13న పూర్తి కాగా, రెండో సొరంగం పనులు ఇవాళ పూర్తి అయ్యాయి. నేటితో వెలిగొండ కల సాకారం అయ్యిందని అధికారులు తెలిపారు. రెండో సొరంగం తవ్వకం పనులు ఇవాళ పూర్తి అయ్యాయని ప్రకటించారు. 2019, మే 30 నాటికి మిగిలిపోయిన 7.698 కి.మీల తవ్వకం పనులు పూర్తి కాగా మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేసినట్లు తెలిపారు. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.