గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళనవేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా అధికారులు, వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దళారుల మోసాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో అచ్చంపేట(Achampet)లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మార్కెట్ కు ఆదివారం పెద్ద సంఖ్యలో రైతులు సుమారు 32,875 బస్తాల వేరుశనగ పంటను తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు వ్యాపారులు కొనుగోళ్లు ప్రారంభించగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.7060, కనిష్ఠంగా రూ.4816 ధరను నిర్ణయించారు. వ్యాపారులు నాణ్యత పేరుతో తక్కువ ధర ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కె్ట్ నిబంధనల ప్రకారం 100 గ్రాముల వేరుశనగలు ఒలిచి గింజల బరువును తూచి దాని బట్టి ధర నిర్ణయించాల్సి ఉంటుంది. అందుకు భిన్నం వ్యాపారులు చేతిలోకి కాయలు తీసుకుని నాణ్యత లేదంటూ ధరను నిర్ధారిస్తూ మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source link