Health Care

వేసవిలో రింగ్‌వార్మ్, దురద వస్తుందా.. ఇలా ఉపశమనం పొందండి..


దిశ, ఫీచర్స్ : వేసవి కాలం వచ్చిందంటే చాలు ముఖం పై మొటిమలు, టానింగ్ సమస్యలు పెరగుతుంటాయి. అంతే కాదు చెమట కారణంగా శరీరం పై ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా వస్తుంటాయి. అలాగే వేడి పెరిగేకొద్దీ, దురద, దద్దుర్లు, వేడి దద్దుర్లు, రింగ్‌వార్మ్ వంటి చర్మ సంబంధిత సమస్యలు కూడా పెరగడం మొదలవుతుంటాయి. చెమట వల్ల చర్మం పై బ్యాక్టీరియా పెరగడం మొదలై దురద, రింగ్‌వార్మ్ వంటి సమస్యలకు వస్తుంటాయి. దీని కోసం, పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే కొన్ని విషయాలు మీ చర్మాన్ని తాజాగా ఉంచడంలో, ఈ సమస్యలను దూరం చేయడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి.

వేప..

వేసవిలో రోజూ వేప ఆకులను లేదా బెరడును నీటిలో వేసి మరిగించి స్నానం చేయాలి. వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మ సమస్యలను దూరం చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. వేప నీటితో స్నానం చేయడం ద్వారా, మీరు ఇన్ఫెక్షన్ వల్ల కలిగే అనేక చర్మసమస్యల నుండి కూడా రక్షిస్తుంది.

కొబ్బరి నూనె..

వేసవి లేదా శీతాకాలం కావచ్చు. కొబ్బరి నూనె మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. తలస్నానం చేసిన తర్వాత కొన్ని చుక్కల కొబ్బరి నూనె తీసుకుని శరీరమంతా మసాజ్ చేయాలి. దీని వల్ల చర్మ ఆకృతి మెరుగుపడుతుంది. రోజంతా దురద సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

ఇంటి చిట్కాలతో రింగ్‌వార్మ్ నుండి ఉపశమనం..

కొబ్బరినూనెలో కొద్దిగా కర్పూరాన్ని మిక్స్ చేసి రింగ్‌వార్మ్ ఉన్న ప్రదేశంలో రాయండి. దీంతో కొద్ది రోజుల్లో ఉపశమనం లభిస్తుంది. అలాగే వేప ఆకుల పేస్ట్ రింగ్‌వార్మ్ సమస్యను వదిలించుకోవడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

లెమన్ గ్రాస్ డికాక్షన్..

వేసవిలో నిమ్మగడ్డిని ఉపయోగించడం వల్ల చర్మం పై మొటిమలు, హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని డికాక్షన్ లేదా టీ తాగడం వల్ల శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు దురద, దద్దుర్లు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. లెమన్‌గ్రాస్ టోనర్‌ని ఉపయోగించడం వల్ల చర్మం మెరుగుపడి ముఖంలో మెరుపు వస్తుంది.



Source link

Related posts

వేసవిలో తాజాగా ఉండాలనుకుంటున్నారా.. ఇంట్లోనే ఈ పెర్ఫ్యూమ్ తయారు చేసుకోండి..

Oknews

మిస్టరీని ఛేదించే ఆరు సైకలాజికల్ టిప్స్.. ఎవరు ఏమనుకుంటున్నారో కనిపెట్టేయోచ్చు..!

Oknews

అందంగా అవ్వాలనుకుంటున్నారా!.. ఈ ఒక్క చిట్కాతో శ్రీ లీల వంటి గ్లామర్ మీ సొంతం..

Oknews

Leave a Comment