ఏదో కారణాలతో కాంగ్రెస్ వీడిన వాళ్లంతా వెనక్కి రావాలని, రాహుల్ గాంధీని ప్రధాని చెద్దామని ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి అన్నారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ …ఎవరికి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేయడమే అన్నారు. బీజేపీ వాళ్లను తరిమి కొట్టాలన్నారు. షర్మిల కాన్వాయ్ ను ప్రభుత్వం అడ్డుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ను చూసి వైసీపీ ప్రభుత్వం భయపడుతోందన్నారు. ఎందుకు వాహనాలు అడ్డుకున్నారని ప్రశ్నించారు.