GossipsLatest News

వైసీపీ నేతలకి చుక్కలు చూపిస్తున్నారు


గతంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై చెప్పులు, రాళ్లు విసిరిన ఘటనలో వైసీపీ మంత్రులు, నేతలు ఇష్టం వచ్చినట్టుగా నోరుపారేసుకున్న వీడియోస్ ని ఇప్పుడు జగన్ పై రాయి పడింది అంటూ గగ్గోలు పెడుతున్న వైసీపీ నేతలకి వేసి చుక్కలు చూపిస్తున్నారు. చంద్రబాబు ఇకపై ప్రజల్లో తిరగలేదు, ప్రజా వ్యతిరేఖత చంద్రబాబు పై ఉంది అనడానికి ఇదే నిదర్శనం, చంద్రబాబుని ప్రజలు రాళ్లు వేసి మరీ వ్యతిరేకిస్తున్నారు అంటూ అంబటి దగ్గర నుంచి కొడాలి నాని వరకు కారు కూతలు కూసిన వీడియోస్ ని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన నేతలు ట్రెండ్ చేస్తున్నారు. 

కొడాలి నాని గతంలో మాట్లాడిన వీడియోని ప్లే చేస్తూ.. చంద్రబాబు యాత్ర చేస్తున్నప్పుడు బోలెడంతమంది పోలీసులు పహారాకాస్తున్నారు. ఎవడో చీకట్లో రాయి విసిరాడట ఆయన మీదకి, ఆయన్ని చంపేద్దామని చెప్పి.. ఇంత గులకరాయి అది. నువేమన్నా పావురమా, పిట్టా గులకరాయి పెట్టి కొడితే చచ్చిపోవడానికి, ఆయనే కావాలి వేయించుకుని ఉంటాడు, కార్యకర్తలతో గులకరాళ్లు వేయించుకోవడం అనేది బాబుకు అలవాటు అంటూ అప్పుడు బాబు పై చేసిన కామెంట్స్ ఇప్పుడు జగన్ కి జరిగిన ఘటనతో సింక్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. 

అంతేకాదు అంబటి రాంబాబు, రోజా, అమర్నాథ్ లాంటి మంత్రులు కూడా చంద్రబాబు పై దాడి అనేది సింపతీ కోసమే డ్రామా, ఈ డ్రామాలు బాగా అలవాటు, Political High Level Drama, సానుభూతి పొందాలి అనే ప్రయత్నం, ఏ జన్మలో పాపాలు ఆ జన్మలోనే పరిహారం, యాత్ర హైలెట్ అవ్వాలని వీధి నాటకం అంటూ మాట్లాడిన మాటలని ఇప్పుడు జగన్ కే ఆపాదిస్తున్నారు. అప్పుడు చంద్రబాబు అలా చేసి ఉంటే ఇప్పుడు జగన్ కూడా సింపతీ కోసమే చేశాడా? జగన్ ఎమన్నా పావురమా, పిట్టా రాయి పెట్టి కొడితే పోవడానికి అంత గోల చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలని నెటిజెన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. 



Source link

Related posts

‘పుష్ప 2’ని టార్గెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. పాపం అల్లు అర్జున్!

Oknews

నాని సినిమాల కోసం ఎగబడుతున్న నెట్ ఫ్లిక్స్..!

Oknews

Rashmika Mandanna is drenched with workouts వర్కౌట్స్ తో తడిచిపోయిన రష్మిక మందన్న

Oknews

Leave a Comment