టీడీపీ, జనసేన కలయిక భయం వైసీపీలో లేదు
టీడీపీ, జనసేన కలిశాయనే భయం అధికార వైసీపీలో కనిపించడంలేదని ఉండవల్లి అన్నారు. వైసీపీ 40 శాతం, టీడీపీ 40 శాతం ఓట్ల పర్సంటేజ్ వస్తుందనుకుంటున్నానన్నారు. గత ఎన్నికల్లో జనసేనకు 6 శాతం ఓట్లు వచ్చాయన్నా ఆయన ఈసారి ఓట్ పర్సంటేజ్ పెరుగుతుందన్నారు. కేంద్ర మధ్యంతర బడ్జెట్(Budget) పై స్పందిస్తూ… దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం మరోసారి చిన్నచూపు చూసిందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో ఉత్తరాదిలో ఎక్కువ స్థానాలు పెంచుతారన్నారు. జనాభా, అబద్దాల ప్రచారంలో ఇండియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ఏపీ నుంచి ఎన్నికైన 25 మంది ఎంపీలూ బీజేపీ(BJP)కి మద్దతు దారులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకం కావాలన్నారు.