Top Stories

వైసీపీ ప్ర‌భుత్వానికి పాడె స‌రే.. త‌మ‌రెక్క‌డ సార్‌!


నారా లోకేశ్ క్షేత్రస్థాయిలో పోరాటాన్ని వదిలేసి ఢిల్లీ వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నారు. బాబు అరెస్ట్ అనంత‌రం ఆయ‌న ఏపీలో ప‌త్తా లేకుండా పోయారు. దీంతో త‌న‌ను అరెస్ట్ చేస్తార‌నే భ‌యంతో లోకేశ్ ప‌లాయ‌నం చిత్త‌గించార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. కానీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న ప‌రాక్ర‌మాలు అలివికావ‌డం లేదు. వైసీపీ ప్ర‌భుత్వాన్ని శాప‌నార్థాలు పెడుతున్నారు.

అంగ‌న్‌వాడీల‌పై ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోప‌డాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. ట్విట‌ర్ వేదిక‌గా ఆయ‌న భారీ డైలాగ్‌లు కొట్టారు. నిర‌స‌న‌ల మాట వింటేనే జ‌గ‌న్ ఉలిక్కిప‌డుతున్నార‌ని ఎద్దేవా చేశారు. అంగ‌న్‌వాడీల‌పై అంత క‌ర్క‌శ‌మా అని లోకేశ్ ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు అరెస్ట్‌పై, అలాగే త‌మ హ‌క్కుల‌పై పోరాడుతున్న వివిధ వ‌ర్గాల‌పై ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు జ‌గ‌న్ పిరికిత‌నాన్ని చాటి చెబుతున్న‌ట్టు లోకేశ్ పేర్కొన్నారు.

ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన అంగ‌న్‌వాడీ మహిళలపై అంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటో అర్ధం కావడం లేదని లోకేశ్ తెలిపారు. అతి త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి పాడెకడతారని లోకేశ్ వార్నింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. లోకేశ్ హెచ్చ‌రించ‌డం స‌రే, పోరాడుతున్న వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా అండ‌గా నిలిచిందెక్క‌డ‌? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. 

చంద్ర‌బాబు అరెస్ట్‌ను నిరిసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తుంటే, లోకేశ్ మాత్రం ఢిల్లీకి వెళ్ల‌డం ద్వారా వారిలో స్థైర్యాన్ని దెబ్బ‌తీసిన‌ట్టైంద‌నే చ‌ర్చ ఆ పార్టీలో సాగుతోంది.



Source link

Related posts

ఉత్తరాంధ్రాలో కాంగ్రెస్‌కి బోణీ నిల్?

Oknews

ఆ వ్యాఖ్య‌ల‌తో చాలా అవ‌మాన‌ప‌డ్డాం…!

Oknews

వివాదంపై ఎట్టకేలకు స్పందించిన నయనతార

Oknews

Leave a Comment