దిశ, డైనమిక్ బ్యూరో: యంత్రాలు, వివిధ రకాల టెక్నాలజీ ఉపయోగించి రైతులు వ్యవసాయం చేయడం చూశాము. కానీ మనుషుల అవసరం లేకుండా రోబోలు వ్యవసాయం చేయడం చూశారా? దీనికి సంబంధించిన వీడియో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వరి నాట్లు వేస్తున్న రోబోలు, పంట అయిన తర్వాత వరి పంట కోస్తున్న రోబోలు ఈ వీడియోలో కనబతాయి. సాధారణ మనుషుల లాగే మడిలోకి దిగి వరినాట్లు, పంట కోయడం ఆ రోబోలు చేస్తుంటాయి.
ఈ రోబోల వ్యవసాయం పై నెటిజన్లు మాత్రం పలు విధాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో ఇలాంటి రోబోలు ఉండడం ఎంతో ఉపయోగమని నెటిజన్లు అభిప్రాయాలు తెలుపుతున్నారు. రోబోలకు కూలి బదులు ఛార్జింగ్ పెడితే సరిపోతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు పొలం మీద వచ్చే డబ్బు కన్నా, వీటిని మెయింటెయిన్ చేసే ఖర్చు ఎక్కువ ఉంటదని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. కాగా, రోబోల వ్యవసాయం ఈ వీడియో (ఏఐ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ వీడియో అని నిపుణులు చెబుతున్నారు.