దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికలు మనిషి జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఒక వ్యక్తి జాతకంలో దోషాల కారణంగా ఎన్నో సమస్యలను ఎదొర్కోవాలి. నవ గ్రహాల్లో శనీశ్వరుడు స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతన్ని న్యాయ దేవతగా చెబుతుంటారు. మనం చేసే మంచి, చెడును బట్టి మనకి ఫలితాలను ఇస్తుంటాడు. ఒకరి లైఫ్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటునట్లయితే , అతని జాతకంలో శని దోషం ఉన్నట్లే అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. శనీశ్వరుడు ఒకసారి కన్నెర్ర చేస్తే.. సంతోష సమయాలు కాస్తా విషాదకరంగా మార్చేయగలడు. ఈ దోషంతో బాధపడేవారు శనివారం రోజున ఈ పరిహారాలు చేస్తే.. శని దేవుడు అనుగ్రహం పొందుతారు. అవేంటో ఇక్కడ చూద్దాం..
1. శనివారం రావి చెట్టును పూజించడం వలన దోషాలను తొలగించడానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ రోజున సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించండి. దీని తర్వాత నూనె దీపం వెలిగించి శనీశ్వరునికి నూనె సమర్పించాలి.
2. శనీశ్వర పూజ సమయంలో శనిదేవుని కళ్లలోకి చూడకూడదు. ఆ సమయంలో శనీశ్వరుని కళ్లలోకి చూసే వ్యక్తిపై శని చెడు కన్ను ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ఇది వారి జీవితంలో సమస్యలకు దారితీస్తుంది.
3. శని దోషం యొక్క ప్రతికూల ప్రభావాలను నివారించడానికి, శనివారం రోజున ఒక గిన్నెలో నూనెను తీసుకుని.. దానిలో మీ ముఖాన్ని చూడండి. ఇలా చేయడం వలన ఇతర దోషాలు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.