శివం భజే.. మిస్టీరియస్ థ్రిల్లర్


ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. అది కార్తికేయ 2 అయినా హనుమాన్, కల్కి ఇలా ఏదైనా.. చిన్న దేవుడి టచ్ ఇవ్వాలి లేదా, మన పురాణేతిహాసాల ప్రమేయం వుండాలి. రొటీన్ ప్లాట్ అయినా ఇలా కనెక్షన్ వుంటే అది కొత్త టర్న్ తీసుకున్నట్లే.

లేటెస్ట్ గా విడుదలైన శివం భజే సినిమా ట్రయిలర్ కూడా ఇదే విషయం చెబుతోంది. దేశభక్తి నుంచి, మిస్టరీ మర్డర్ల మీదుగా నడిచే కథ. మిస్టరీ వెనుక చిన్న డివోషనల్ టచ్. అది చాలు కదా జ‌నాలకు ఇంట్రస్ట్ కలగడానికి.

హీరో అశ్విన్, నటడు మురళీ శర్మ కలిసి కథను పరిశోధన దిశగా నడిపించారు. ట్రయిలర్ మొత్తం చూస్తుంటే.. ట్రయిలర్ లో పడిన సంభాషణలు వింటే, సినిమా చూస్తేనే అర్థం అయ్యే థ్రిల్లింగ్ విషయాలు ఏవో వున్నాయి అని అర్థం అవుతోంది. ట్రయిలర్ ప్రకారం స్టోరీ కాన్సెప్ట్ రోటీన్ నే కానీ, దానికి ముడివేసిన అసలు విషయాలు వేరే అని తెలుస్తోంది.

ట్రయిలర్ రేసీగా వుంది. బ్యాక్ గ్రవుండ్ స్కొర్ బాగుంది. మూలి మహేశ్వర రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు దర్శ‌కుడు అప్సర్. హైపర్ అది, సాయి ధీన, దిగంగన సూర్యవంశీ తదితరులు నటించారు. వికాస్ సంగీతం అందించారు.

The post శివం భజే.. మిస్టీరియస్ థ్రిల్లర్ appeared first on Great Andhra.



Source link

Leave a Comment