తన ఒంటి చేత్తో సినిమాని నడిపించి ఆ సినిమాకి బాక్స్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించే ఎనర్జిటిక్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు.ఏ యాంగిల్ లో ఫ్రేమ్ పెట్టినా కూడా నవ నూతనంగా నటించగల తిరుగులేని మిస్సైల్ ఎన్టీఆర్. ఆయన చేసే యాక్టింగ్ కి ఫైట్స్ కి డాన్స్ కి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తాజాగా దేవర చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పుడు ఆ మూవీకి సంబంధించిన గుడ్ న్యూస్ ఒకటి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.
ఎన్టీఆర్ దేవర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. దీంతో దేవర ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని అందరు ఎదురుచూస్తున్నారు.తాజాగా దేవర రిలీజ్ డేట్ ని వచ్చే నెల శివరాత్రి రోజున మేకర్స్ వెల్లడి చేయనున్నారనే వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.ఇప్పుడు ఈ వార్తతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం దేవర లో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ లో గాయాలపాలవ్వడంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో దేవర మూవీ ఇప్పుడప్పుడే రాదని సెప్టెంబర్ లో ఉండవచ్చనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచం నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు వాళ్ళందరికి ఎనర్జీ ని ఇవ్వడం కోసమే మేకర్స్ దేవర అప్ డేట్ ని ఇవ్వనున్నారనే టాక్ చాలా బలంగా వినిపిస్తుంది. ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం విడుదలైన దేవర టీజర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి థియేటర్స్ లో దుమ్ము రేపుతోంది. టీజర్ చివరలో ఎన్టీఆర్ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని నెత్తురునే ఎక్కువ చూసింది అందుకే దీనిని ఎర్ర సముద్రం అని అంటారు అని చెప్తాడు. ఎన్టీఆర్ లాంటి నటుడు ఉన్నాడు కాబట్టే అది తెలుగు సినిమా అయ్యిందని ఇప్పుడు ఫ్యాన్స్ అంటున్నారు.