మంచు మోహన్ బాబు, మంచు విష్ణు లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న ఫాంటసీ డ్రామా చిత్రం కన్నప్ప. పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి తన రెండు కళ్ళని సమర్పించిన పరమ భక్తుడైన భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా కన్నప్ప తెరకెక్కుతుంది. మంచు విష్ణు కన్నప్ప పాత్రని పోషిస్తుండగా మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.
కన్నప్ప లో శివుడు గా రెబల్ స్టార్ ప్రభాస్ మెరవనున్నాడనే విషయం అందరకి తెలిసిందే. ఆ అధిదేవుడి ధర్మపత్ని ఆదిపరాశక్తి పార్వతి దేవి గా కంగనా రనౌత్ చెయ్యనుందనే వార్త సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.ఈ మేరకు ఆ వార్త నిజం అనేలా త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. అలాగే మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా ఆ రోజు బయటకి రానున్నాయని అంటున్నారు. AVA ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ లు పాన్ ఇండియా లెవల్లో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో కన్నప్ప ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది.
బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కన్నప్ప లో ప్రీతి ముకుందన్,మోహన్ లాల్ శివరాజ్ కుమార్, రాధికా, బ్రహ్మానందం, శరత్ కుమార్ లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పార్వతి దేవి పాత్రలో నయనతార నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు కంగనా రనౌత్ అంటున్నారు. మరి ఇది కూడా ఎంత వరకు నిజమో కొన్ని రోజులు అయితే గాని తెలియదు.