దిశ,ఫీచర్స్: కొందరికి ఎంత కష్టపడినా డబ్బు ఇంట్లో నిలవదు. కష్ట పడి పని చేసినా కొందరికి సమయం కలిసి రాదు. వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి చాలా కష్ట పడుతుంటారు. ఇలా అవుతుంటే కుండలి దోషం వల్లనో లేక వాస్తు దోషం వల్లనో తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. మీ లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది. ఆ వాస్తు చిట్కా గురించి ఇక్కడ తెలుసుకుందాం.. దీంతో డబ్బు సమస్యలు తీరుతాయి.
సాధారణంగా ప్రతి ఇంట్లో తులసి చెట్టు, పూల చెట్లు ఉంటాయి. ఇవి చాలా ముఖ్యమైనవి. అయితే, మనీ ప్లాంట్లు ప్రతి ఇంటిలో కనిపిస్తాయి. ఇంట్లో దోషాన్ని నివారించడం కూడా చాలా ముఖ్యం. అయితే, మీరు శుక్రవారం రోజున ఈ మనీ ప్లాంట్ దగ్గర ఒక రూపాయి కాయిన్ పెట్టి, లక్ష్మీదేవిని పూజించిన తర్వాత మనీ ప్లాంట్ మొక్కలో పాలు పోయాలి. ఆ తర్వాత మీకే తెలుస్తుంది.వారంలోపు మీ ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఇల్లు కూడా ఆనందం, శాంతితో నిండి ఉంటుంది.
ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టేటప్పుడు సరైన దిశలో ఉందో? లేదో చూసుకోవాలి. మీకు తెలియకుండా వేరే దిశలో ఈ ప్లాంట్ ఉంటే, దాని ప్రభావం కూడా మీ మీద చూపిస్తుంది. సాధారణంగా, మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో కానీ ఉత్తరం దిశలో కానీ ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. నర దిష్టి ఉన్న వారు కూడా ఈ చిట్కా ను పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి.