Entertainment

శౌర్య సరసన నిధి అగర్వాల్! – Telugu Shortheadlines


శౌర్య సరసన నిధి అగర్వాల్!

ఛలో సినిమాతో నాగ శౌర్యకు మంచి బ్రేక్ వచ్చిందుకునేలోపే ఆ తర్వాత వచ్చిన సినిమాలు నౌగ శౌర్యకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ తరుణంలో తర్వాత వచ్చే సినిమాల ఎంపికలో ఎంతో జాగ్రత్తపడుతున్నాడు. ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత కీలక పాత్ర పోషిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాతో పాటు మరో సినిమాకు ఒప్పుకున్నట్లు సమాచారం. సుకుమార్ దగ్గర గతంలో అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేసిన కాశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిసింది. డైరక్టర్ కాశీ చెప్పిన కథ నచ్చడంతో సుకుమార్ బ్యానర్‌పై నిర్మించడానికి సుకుమార్ ముందుకొచ్చాడు. సవ్యసాచి సినిమాలో తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్‌ను నాగ శౌర్య సరసన ఇందులో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు టాలీవుడ్ టాక్. అతి త్వరలో విడుదల కానున్న అఖిల్ మిస్టర్ మజ్ను చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది.

 



Source link

Related posts

ఎట్టకేలకు 'లీడర్-2'కి ముహూర్తం కుదిరింది..!

Oknews

టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు.. రాశీ ఖన్నా!

Oknews

మహిళా ప్రాధాన్యత సినిమా అనే మాట అబద్ధం..వాళ్ళకి ధన్యవాదాలు 

Oknews

Leave a Comment