Health Care

శ్రావణమాసంలో పెళ్లి.. జీవితం సంతోషమయంగా ఉంటుంది…


దిశ, ఫీచర్స్: పెళ్లి రెండు మనుషుల, మనసుల కలయిక. సంతోషం, సక్సెస్ లో మాత్రమే కాదు కష్టనష్టాల్లోనూ తోడు ఉంటామని భాగస్వామికి ఇచ్చే భరోసా. జీవితాంతం బాధ్యతగా ఉండే బంధం. ఒక ఆనందకర క్షణంతో మొదలయ్యే ఈ ప్రయాణం.. వారి జీవితాలను సుసంపన్నం చేసే అనేక ప్రయోజనాలను అందిస్తుంది. సంతృప్తి, సరదాలను పంచుతుంది. శ్రావణమాసంలో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న వేళ… అలాంటి బ్లిస్ ఫుల్ జర్నీ ద్వారా సాధ్యమయ్యే మరిన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ గురించి తెలుసుకుందాం.

ఎమోషనల్ సపోర్ట్

వివాహం లోతైన భావోద్వేగ బంధాన్ని పెంచుతుంది. ఏ సమయంలోనైనా పరస్పర మద్దతు ఇచ్చేలా ఉంటుంది. జీవిత భాగస్వాములు ఒకరినొకరు మొదటి విశ్వసనీయులుగా మారుతారు. కష్ట సమయాల్లో భరోసా ఇస్తారు. అన్ని విషయాల్లో భాగస్వామికి అవగాహన పెంచుతూనే.. అన్ని సౌకర్యాలను అందించేందుకు ప్రయత్నిస్తారు.

బాధ్యతల స్వీకరణ

ఇంటి పనులు, ఫ్యామిలీ ఇష్యూస్, పిల్లల విషయాలు అన్నింటిలోనూ బాధ్యతలను సమానంగా పంచుకుంటారు. తద్వారా ఒత్తిడి లేని జీవితాన్ని పొందుతారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు.

ఫైనాన్షియల్ సపోర్ట్

ఇద్దరు కలిసి జాబ్ చేయడం వల్ల రెండు చేతుల సంపాదించినట్లు అవుతుంది. లైఫ్ లో నెక్స్ట్ స్టెప్ ఎదిగేందుకు కావాల్సిన ఆర్థిక సహకారం లభిస్తుంది. ఉమ్మడిగా లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటిని రీచ్ అయ్యేందుకు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవచ్చు. ఆర్థిక స్థిరత్వం, భద్రత ఉండేలా జాగ్రత్త పడొచ్చు.

పర్సనల్ డెవలప్మెంట్

జీవిత భాగస్వాములు ఒకరి ఆశయాలకు మరొకరు మద్దతు ఇస్తారు. తల్లిదండ్రుల దగ్గర పొందలేని సపోర్ట్ కూడా భర్త/భార్య ద్వారా పొందే సౌకర్యం ఉంటుంది. ఎందుకంటే ఒకరి డెవలప్మెంట్ ఆటోమేటిక్ గా మరొకరిది అవుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఉన్న లక్ష్యాలను కూడా రీచ్ కావచ్చు. మీరు అనుకున్నట్లుగా సొసైటీలో ఉన్నత స్థాయిలో ఉండొచ్చు.

కుటుంబ బంధాలు బలం

పెళ్లి అనేది ఇద్దరు మనుషులను మాత్రమే కాదు రెండు కుటుంబాలను దగ్గర చేస్తుంది. విస్తరించిన కుటుంబం కలిసినప్పుడు ఐక్యత, సొంతం అనే భావం కలుగుతుంది. సంప్రదాయంగా ఉండే మీటింగ్స్ మరింత ఆనందాన్ని పంచుతాయి.

మెరుగైన ఆరోగ్యం

వివాహితులు మానసికంగా, శారీరకంగా ఆనందంగా ఉంటారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. జీవిత భాగస్వామి అందించే ఎమోషనల్ సపోర్ట్, లైఫ్ స్టైల్ కారణంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవిస్తారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒంటరిగా ఉండే వారి కన్నా భాగస్వామి, పిల్లలతో ఉన్న వ్యక్తులు మరింత సంతోషంగా ఉంటున్నారని స్టడీస్ నిరూపించాయి.

సోషల్ లైఫ్

పెళ్లి అయిన కొత్త జంట తరుచుగా ఇరు వైపులా స్నేహితులను కలిగి ఉంటారు. ఆ ఫ్రెండ్స్ ను ఒకరికొకరు ఇంట్రడ్యూస్ చేస్తారు. దీనివల్ల సోషల్ లైఫ్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. కొత్త స్నేహితులు, వెకేషన్స్ తో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఇది మరింత సంతృప్తికరమైన, చురుకైన జీవితాన్ని కలిగి ఉండేందుకు కారణం అవుతుంది.

పెరిగిన స్థిరత్వం

పెళ్లి తర్వాత భాగస్వామితో పుట్టింటి నుంచి మరోచోటికి వెళ్లడం కొత్తలో కాస్త ఇబ్బందిగా, ఒత్తిడిగా అనిపించినా.. ఆ తర్వాత భద్రతా భావం కలుగుతుంది. స్థిరంగా ఒకే చోట ఉండటం వల్ల సౌకర్యంగా ఫీల్ అవుతారు. స్ట్రెస్ రేట్ తగ్గుతుంది. సెక్యూర్ ఫీలింగ్ పెరుగుతుంది. దీంతో తాము అనుకున్న విధంగా లైఫ్ సెట్ చేసుకునేందుకు కలిసికట్టుగా ప్రయత్నించవచ్చు.



Source link

Related posts

ఈ ఫుడ్ కాంబినేషన్ను తింటున్నారా.. కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య పెరగడం ఖాయం..

Oknews

పరగడుపున ఈ పండు తింటే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

Oknews

డెంగ్యూ భయమా..? అయితే ఈ 5 పండ్లతో ప్లేట్‌లెట్ కౌంట్ పెంచుకోండి..!

Oknews

Leave a Comment